వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అత్యాచారాల నిరోధానికి మరణ శిక్ష ఆయుధమా?

December 4, 2019

మరణ శిక్షలకు బదులు న్యాయవ్యవస్థలోనూ, చట్టాన్ని అమలు జేసే వ్యవస్థలోనూ ప్రాథమికమైన మార్పులు రావాలని కోరాలి. నిర్భయ చట్టం, పోస్కో చట్టం చెబుతున్నమంటే కఠినమైన శిక్షలతో తీవ్రమైన నేరాలు ఆగిపోవని. వ్యవస్థీకృతమైన మార్పులు రావాలి. కేవలం శిక్షలు అమలు జేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోవు. కఠిన చట్టాల వల్ల ప్రయోజనం ఉండదు. సామాజికమైన మార్పు రావాలి. అత్యాచారాలు జరిపేవారికి తాము చేస్తున్నది తప్పు అని తెలుసు. అత్యాచారం చేసే వారు తాము నేరం చేస్తున్నామని అనుకోవడం లేదు.
అత్యాచార సంఘటనలను ఎదుర్కోవడానికి రాజకీయ సంకల్పం కావాలి, ఏ చట్టాలూ అవసరం లేదు
హైదరాబాద్‌ ‌సమీపంలో దిశపై హత్యాచారం జరిగిన సంఘటనలో నిందితులను ఉరి తీయాలంటూ దేశవ్యాప్తంగా జనం ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఏడేళ్ళ క్రితం ఢిల్లీలో నిర్భయ సంఘటన ఏవిధంగా అయితే మహిళా లోకంలో చైతన్యాన్ని సృష్టించిందో ఇప్పుడు దిశ హత్యాచార సంఘటన అదే స్థాయిలో మహిళలను కదిలించింది. పార్లమెంటు ఉభయ సభల్లో పార్టీలతో నిమిత్తం లేకుండా అందరూ ఈ ఘోరాన్ని ఖండించారు. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ ‌చేశారు. వివిధ నగరాల్లో మహిళలు, విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళనలు జరుపుతున్నారు. పార్లమెంటు ఈ అంశాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించింది. ఇంకా చర్చిస్తోంది. రక్షణ మంత్రి రాజ్‌ ‌నాథ్‌ ‌సింగ్‌ ఎవరు ఏ సలహా ఇచ్చినా పరిశీలించేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇటువంటి హేయమైన సంఘటనలో నిందితులకు సరైన శిక్షపడాలన్నదే ప్రభుత్వం అభిమతమని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను ఉరితీయాలన్న డిమాండ్‌ ‌రావడం అర్థం చేసుకోదగినదే కానీ, ఇది తొలిసారి కాదు. అయితే, భావోద్వేగాలు చల్లారిన తర్వాత పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆవేశకావేశాలు పెల్లుబికినప్పుడు ఆలోచనకు ఆస్కారం ఉండదు. కానీ, నిదానంగా ఆలోచిస్తే నిందితులను ఉరితీయడం వల్ల ఇలాంటి ఘోరాలు ఆగిపోతాయా? ఉరిశిక్ష అమలు జరిగితే బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగినట్టు అవుతుందని భావిస్తారు. ఉరిశిక్ష సరైనదేనా అన్న అంశంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్ష అమలు జేయాలని ఇలాగే డిమాండ్లు వచ్చాయి. అయితే,ఇంతవరకూ అమలు కాలేదు. ఆ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధించినప్పటికీ హత్యాచారాలు తగ్గలేదు, సరికదా మరింతగా పెరిగాయి. ఉరి శిక్షలకు సరైన సాక్ష్యాలు ఉండవు.
అందువల్ల మరణ శిక్షలకు బదులు న్యాయవ్యవస్థలోనూ, చట్టాన్ని అమలు జేసే వ్యవస్థలోనూ ప్రాథమికమైన మార్పులు రావాలని కోరాలి. నిర్భయ చట్టం, పోస్కో చట్టం చెబుతున్నవేమంటే కఠినమైన శిక్షలతో తీవ్రమైన నేరాలు ఆగిపోవని. వ్యవస్థీకృతమైన మార్పులు రావాలి. కేవలం శిక్షలు అమలు జేసినంత మాత్రాన అత్యాచారాలు ఆగిపోవు. కఠిన చట్టాల వల్ల ప్రయోజనం ఉండదు. సామాజికమైన మార్పు రావాలి. అత్యాచారాలు జరిపేవారికి తాము చేస్తున్నది తప్పు అని తెలుసు. అత్యాచారం చేసే వారు తాము నేరం చేస్తున్నామని అనుకోవడం లేదు. నేరస్థకులు నేరాలు చేస్తారు. శిక్ష నుంచి తప్పించుకోవచ్చని వారనుకుంటారు. ఆ భావనలో మార్పు రావాలి. మన దేశంలో హత్య కేసులు, నేరాలకు సంబంధించిన కేసుల విచారణ పూర్తి కావడానికి ఏళ్లకేళ్లు పడుతోంది. మరణ శిక్షలు పడినవారు అప్పీలు చేసుకోవడానికిపై కోర్టులు ఉన్నాయి. చివరిగా రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరే సదుపాయం ఉంది. ఇవన్నీ పూర్తి కావడానికి చాలా కాలం పడుతుంది. ఈలోగా ఇలాంటివి ఎన్నో జరిగి పోతుంటాయి. అందువల్ల మరణశిక్ష వంటి కఠిన శిక్షల వల్ల ప్రయోజనం లేదు. అత్యాచార బాధితులు మనం కోరుతున్న న్యాయం కన్నా ఇంకా ఉన్నతమైన సాయానికి అర్హులు. మరణశిక్షలు ఇలాంటి సమస్యలను పరిష్కరించలేవు. విచారణలు పూర్తి అయ్యే సరికి చాల కాలం పడుతుంది. ఇలా చెప్పడం వల్ల నేను నిరాశా వాదిని, స్పృహ లేని వాడినని అనుకోవచ్చు. అనుకోనివ్వండి.
– ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్