వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అమ్మతనం!

November 18, 2019

గుర్రాలెక్కిన కోరికలు
గుట్టుచప్పుడు కాకుండా
గర్భాన్ని ఆశ్రయిస్తున్నాయి

నవమాసాలు,
మోసిన మాతృమూర్తులు
ద్రౌపదినే మరిపిస్తున్నారు

మెడలో
పుస్తెల తాళ్లకు బదులు
పెళ్లి కాని భర్తలు
వేలాడుతున్నారు

తల్లి పేగు బంధాలను
ముళ్ళ పొదల్లో
మురికి కూపాలకు
ముట్ట చెబుతున్నారు

కారుతున్న
చనుబాలు
కార్చిచ్చులా
దేహాన్ని రగిలిస్తున్నాయి

అనాథ•లు
అగాథాలలో
తమ గాథలను
తవ్వుకుంటున్నారు

కమ్మనైన తల్లితనం
కరుడు కట్టిన కాఠిన్యంతో
అమ్మతనానికే ప్రశ్నార్థకమైంది
– కట్టెకోల చిన నరసయ్య
9951260316.
(భద్రాద్రి కొత్తూడెం జిల్లా అనంతారం గ్రామం ముల్లపొదల్లో బాలల దినోత్సవం రోజున అప్పుడే పుట్టిన పసికందును వదిలేసిన సంఘటనకు స్పందించి..)