-డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం
వ్యాధి బాధితులు వాడిన రేజర్లు, బ్లేడ్లు, సిరంజిలు, సూదులు ఇతరులు వాడటం వల్ల, హెచ్ఐవి బాధితులతో సురక్షితం కాని లైంగిక సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7గురు హెచ్ఐవి బాధితులు ఉన్నారని ప్రభుత్వ అంచనా. స్వచ్ఛందంగా తెలుసుకోవాలి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 1,32,000 వేల మంది బాధితులు ఉన్నారు. కాని 82,000వేల మందిని మాత్రమే ఇప్పటికి గుర్తించారు.
వైజ్ఞానికంగా మానవుడు అన్ని రంగాల్లో గొప్ప అబివృద్ధిని సాధించినప్పటికీ ఆరోగ్యం గురించి(హెచ్ఐవి) పూర్తిగా అవగాహన లేకపోవడంతో కళంక భావంతో జీవిస్తున్నారు. అందరు ప్రజలు ఒకటే అయినప్పటికి హెచ్ఐవి బాధితులు ముందుకు రాలేక పోతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి హెచ్ఐవి పూర్తిగా నిర్మూలించాలన్న సంకల్పంతో ఇంటింటి ప్రచారం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు..ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు, ప్రచార, ప్రసార సమాచార మాధ్యమాల ద్వారా కళాజాత కార్యక్రమాల ద్వారా హెచ్ఐవి సంమ్రించే మార్గాలపై, నివారణ చర్యలపై పరీక్ష, చికిత్స విదానం, కళంక భావన, వివక్షను తొలగించే విధంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. భారతదేశంలో 21 లక్షల మంది ప్రజలు హెచ్ఐవి బాధితులు ఉన్నారు. లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే జననేంద్రియ, ప్రత్యుత్పత్తి నాళ వ్యాధులను పూర్తిగా నివారించడానికి కండోమ్‌లు తప్పనిసరిగా వాడాలి. కండోమ్‌ను సరిగా వాడాలి, సరిగా తొలగించాలి. జేబులోనే పర్సులోనో పెట్టుకోకూడదు. కాలపరిమితి దాటిన వాటిని వాడరాదు. జారుడు పదార్థం కలిగిన వాటినే వాడాలి. సూక్ష్మక్రిమి సంహారక కండోమ్‌లు వాడితే మరీ మంచిది. ప్రపంచంలో ప్రతి సంవత్సరం 20 లక్షల మంది డ్రగ్స్ ఇంజక్ట్ చేసుకొని హెచ్ఐవికి గుర వుతున్నారు. గాయం లోతైనపుడు సూది కండరంలోకి దిగబడినప్పుడు, బాధితుని రక్తం ఆ సూది మీద అంటుకుని ఉన్నపుడు, ఇతరులకు హెచ్ఐవి సోకే ప్రమాదం ఎక్కువ. పచ్చబొట్లు పొడిపించడం, ముక్కుచెవులు కుట్టించడం. గంట్లు పెట్టడం, సున్తీ చేయించడం వంటి వాటి వల్ల కూడా తగిన జాత్రత్తలు పాటించక పోతే వ్యాధి సోకే ప్రమాదం ఉంది. గతంలో ప్రభుత్వం రెడ్ రిబ్బన్ క్లబ్ ప్రోగ్రాం ద్వారా యువతీ, యువకులకు హెచ్ఐవి కార్యక్రమం నిర్వహించి విజయం సాధించింది. అలాగే సుఖ వ్యాధుల నివారణ చికిత్స కోసం విసృతమైన ఏర్పాట్లు చేసింది. స్వచ్ఛంద సేవాసంస్థల ద్వారా హెచ్ఐవి అధికంగా సోకే అవకాశం ఉన్న హైరిస్క్ గ్రూపులను మీడియం గ్రూపుగా, లోరిస్క్ గ్రూపుగా మార్చడానికి చర్యలు చేపట్టింది. 23పాత జిల్లా కేంద్రాల్లో ఏఆర్టి కేంద్రాలు, 79 లింక్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. అలాగే ప్రతి నెల2016 రూ।।ఆసరా పించన్ ఇస్తున్నారు. సమాజం నిరాదరణకు అన్ని రోగాల కన్నా అనారోగ్యం ఇబ్బందికరమైనది.
సరైన అవగాహాన లేనందువల్ల సమాజాన్ని పట్టిపీడిస్తున్న వ్యాధుల్లో హెచ్ఐవి ఒకటి. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు హెచ్ఐవి, ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన దిశగా పలు కార్యక్రమాలు చేపట్టి సత్పలితాలు పొందుతున్నాయి. తెలంగాణలో 148 బ్లడ్ బ్యాంకుల ద్వారా స్వచ్ఛంద రక్తసేకరణ చేసి హెచ్ఐవి రహిత రక్తాన్ని అందిస్తున్నారు. అలాగే టిబి సోకిన వారందరికి హెచ్ఐవి పరీక్షలు నిర్వహించి వారిని వ్యాధి బారిన పడకుండా కాపాడుతున్నారు. డిసంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించడానికి ఉపన్యాస వ్యాసరచన పోటీలను విరివిరిగా నిర్వహించారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని విజయవంతం చేయడానికి జిలా్ల కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో బారీ ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. విజేతలకు బహుమతి ప్రదానం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి స్వచ్ఛంద సంస్థలు యువజన సంఘాలు శాయశక్తుల కృషిచేస్తున్నాయి. ఈ వ్యాధి పట్ల ఉన్న భయాలను తొలగించడానికి అవగాహన కార్యక్రమమే సరైన టానిక్. హెచ్ఐవి ముఖ్యంగా ఒకరి కలుషిత రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ద్వారా, కలుషితమైన సూదులు, సిరంజిల ద్వారా వస్తుంది. అన్‌సేఫ్ సెక్స్(సురక్షితంకాని) లైంగిక సంబంధాల వల్ల వొస్తుంది. ప్రతి గర్భిణి స్త్రీకి హెచ్ఐవి పరీక్ష చేయించడం ద్వారా పుట్టబోయే బిడ్డకు సోకకుండా జాగ్రత్తపడవచ్చును. రాష్ట్రంలోని 178 సమగ్ర కౌన్సిలింగ్ మరియు పరీక్షా కేంద్రాలు, 855 ఎఫ్ఐసిటిసిల ద్వారా, పిపిటిసీటిల ద్వారా ఉచితంగా రక్త పరీక్ష చేసి మందులిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే హెచ్ఐవి సోకకుండా జాగ్రత్త పడవచ్చును. పెండ్లికి ముందు శృంగారం వద్దే వద్దు పెళ్లైన తర్వాత జీవిత భాగస్వామితో మాత్రమే శృంగారంలో పాల్గొనాలి. ఒకవేళ పై రెండు సాధ్యం కాని ఎడల సరైన విధంగా ప్రతి కలయికలోను కండోమ్‌లను ఉపయోగించాలి. హెచ్ఐవి సోకిన తల్లి గర్బస్థ దశలో ఐసిడీసి వెళ్లి వైద్యుల సలహాలు పాటిస్తే పుట్టబోయే బిడ్డకు 0-5% వరకు హెచ్ఐవి సోకే అవకాశం తగ్గించవచ్చును. సరైన సమయంలో ఐసిడీసి వెళ్లడం ద్వారా తల్లీ బిడ్డలను సురక్షితంగా కాపాడవచ్చును. హెచ్ఐవి అనేది ఎయిడ్స్ వ్యాధిని కలిగించే ఒక క్రిమి. ఈ క్రిమి మన శరీరంలో ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు వెంటనే బయటపడవు దీనిని విండో పీరియడ్ అంటాము. నెమ్మదిగా రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఈ వ్యాధి లక్షణాలు బయటపడతాయి. అలాగే అవకాశవాద అంటువ్యాధులు సోకి పూర్తిగా క్షీణించబడతారు. వ్యాధి బాధితులు వాడిన రేజర్లు, బ్లేడ్లు, సిరంజిలు, సూదులు ఇతరులు వాడటం వల్ల, హెచ్ఐవి బాధితులతో సురక్షితం కాని లైంగిక సంబంధాలు కలిగి ఉండటం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 1000 మందిలో 7గురు హెచ్ఐవి బాధితులు ఉన్నారని ప్రభుత్వ అంచనా. స్వచ్ఛందంగా తెలుసుకోవాలి. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి అంచనా ప్రకారం రాష్ట్రంలో సుమారు 1,32,000 వేల మంది బాధితులు ఉన్నారు. కాని 82,000వేల మందిని మాత్రమే ఇప్పటికి గుర్తించారు.
కాని ప్రతి వారు కూడా ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఒకసారి హెచ్ఐవి ఉన్నది లేనిది రక్తపరీక్ష చేయించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 15 తేదీ నుంచి 30 తేదీ వరకు 15 రోజుల పాటు ‘‘బిస్మార్ట్, గెట్ టెస్టేడ్’‘పేరిట నిర్వహించిన కార్యక్రమం ప్రజల్లో, యువకుల్లో, మహిళల్లో, లారీడ్రైవర్లు, ఆటోడ్రైవర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. స్వచ్ఛంద సంస్థల ప్రచారంతో ప్రజలు స్క్రీనింగ్ శిబిరాలకు హాజరై తమ ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ఎయిడ్స్ హైల్త్ కేర్ ఫౌండేషన్ మరో 50 స్వచ్ఛంద సేవాసంస్థలు ప్రజల్లో కొత్త క్యాంపెయిన్ ద్వారా హెచ్ఐవి సోకకుండా ఊరూరా ప్రచారాన్ని నిర్వహించాయి. స్వచ్ఛంద సంస్దల ఉచిత హెచ్ఐవి స్క్రీనింగ్ శిబిరాలకు స్వచ్ఛందంగా ప్రజలు, వివిధ వర్గాల వారు తరలివొచ్చి తమ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. హెచ్ఐవి పరీక్షకు ముందు, పరీక్షలకు తర్వాత కౌన్సిలర్ కౌన్సిలింగ్ చేసి బాధితులకు కొండంత ధైర్యాన్ని అందిస్తున్నారు. గర్బిణి స్త్రీలకు కూడా పరీక్ష నిర్వహించి రిస్కు బారిన పడకుండా కాపాడుతున్నారు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు మనసా, వాచా, కర్మణా కృషి చేయాలి.
– రావుల రాజేశం,
అధ్యాపకులు -7780185674