వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అవసరానికి తగ్గట్టుగా యూరియా ఇవ్వాలి

September 6, 2019

ఫోటో: శుక్రవారం సిద్ధిపేట కలెక్టరేట్‌లో యూరియాపై అధికారులతో సమీక్షను నిర్వహిస్తున్న మాజీమంత్రి హరీష్‌రావు,పక్కన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితరులు.
ఫోటో: శుక్రవారం సిద్ధిపేట కలెక్టరేట్‌లో యూరియాపై అధికారులతో సమీక్షను నిర్వహిస్తున్న మాజీమంత్రి హరీష్‌రావు,పక్కన దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి తదితరులు.

సొసైటీ ఛైర్మన్లు, అధికారులకు హరీష్‌రావు సూచనఅన్నదాతల అవసరాలకు అనుగుణంగా అన్నీ సోసైటీ(పిఏసిఎస్‌)‌లలో యూరియాను అందివ్వాలి. కో ఆపరేటీవ్‌ ‌సోసైటీ, మండల, గ్రామ ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు యూరియా కొరత లేదని రైతులకు విశ్వాసం కలిగించేలా చెప్పాలి. ప్రధానంగా గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు రైతులకు వివరించి చెప్పాలని కో ఆపరేటీవ్‌ ‌సోసైటీ ఛైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులకు మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు సూచించారు. శుక్రవారం సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగా రెడ్డి, కో ఆపరేటీవ్‌ ‌సోసైటీ ఛైర్మన్లు, డీఏఓ శ్రవణ్‌, ‌మండల వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్ ‌ఫెడ్‌ అధికారులతో యూరియా కొరత అంశంపై సమీక్ష
జరిపారు. ఈ సందర్భంగా హరీష్‌ ‌మాట్లాడుతూ.. కో ఆపరేటీవ్‌ ‌సోసైటీల ద్వారా రైతుల వద్దకే లారీలు పంపాలని అధికారిక వర్గాలను ఆదేశించారు. దీంతో రైతులకు ఖర్చులు తప్పుతాయనీ, యూరియా పంపిణీ కేంద్రాల వద్ద వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు ఉండాలని సూచించారు. యూరియా కొరత ఏర్పడిందని.. రైతులు ఆందోళన చెందొందని రైతన్నలకు భరోసా ఇస్తూనే.. ఈ విషయాన్ని మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, కో ఆపరేటీవ్‌ ‌ఛైర్మన్లు, అధికారిక వర్గాలు సమన్వయంతో రైతులు ఆందోళన చెందకుండా ఇది తాత్కాలికమేనని.. ప్రతి రైతు మదిలో విశ్వాసాన్ని నింపాలని కోరారు. సిద్ధిపేట జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందన్న విషయంపై జిల్లా వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌ అధికారులను సమీక్షలో ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లాలో గతేడాది 20వేల మెట్రిక్‌ ‌టన్నులు యూరియా ఇవ్వడం జరిగిందని, ఈ యేటా ఈ రోజు వరకూ 25వేల 800 మెట్రిక్‌ ‌టన్నుల యూరియాను రైతులకు అందించినట్లు, గతేడాదితో పోలిస్తే.. ఈ యేడు 6వేల మెట్రిక్‌ ‌టన్నుల యూరియా అందజేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్‌ ‌సమీక్షలో వివరించారు. జిల్లాలో ప్రణాళికా ప్రకారం ఈ మాసం వరకు కావాల్సిన 3500 మెట్రిక్‌ ‌టన్నులు యూరియా అవసరం ఉంటే., మరో 1500 టన్నుల యూరియాను 3 రెట్లు అదనంగా మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు చొరవతో తెప్పించడం జరిగిందని వ్యవసాయ శాఖ జిల్లా అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా సిద్ధిపేట జిల్లాలో బఫర్‌ ‌నిల్వలు ఉన్న కారణంగా చుట్టు ప్రక్కల జిల్లాలో యూరియా కొరత ఏర్పడిందన్న నేపథ్యంలో ఎక్కడ యూరియా దొరకదోననీ.. సిద్ధిపేట జిల్లాలోని బఫర్‌ ‌నిల్వల నుంచి ప్రతి మండల కేంద్రాలలో విక్రయాలు జరుపుతున్న సమయంలో పక్క జిల్లాలోని రైతులు సిద్ధిపేట జిల్లాకు రావడంతో యూరియా కొరత అన్న అంశం సమస్యగా ఉత్పన్నమైనట్లు వివరించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో హరీష్‌రావు ఫోన్‌లైనులో మాట్లాడి.. పక్క జిల్లాలోని రైతులు కూడా సిద్ధిపేట జిల్లాలో యూరియా కావాలని వస్తున్నారని, ఇందు కోసం అదనంగా 3 రేకుల్లో యూరియాను ఇవ్వాలని వారిని ఆదేశించారు. జిల్లాలోని రైతులు ఏలాంటి ఆందోళన చెందొందని కలెక్టరేట్‌ ‌కార్యాలయం, వ్యవసాయ శాఖ అధికారిక కార్యాలయాలలో టోల్‌ ‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయాలని డీఆర్వో చంద్రశేఖర్‌, ‌డీఏఓ శ్రవణ్‌క• సూచనలు చేశారు. ఈ సమీక్షలో సిద్ధిపేట, దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని కో ఆపరేటివ్‌ ‌సోసైటీ ఛైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారిక యంత్రాంగం పాల్గొన్నారు.
సిద్ధిపేట మున్సిపాలిటీ ఎమర్జెన్సీ స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టాలి
సిద్ధిపేటలో ఎమర్జెన్సీ స్పెషల్‌ ‌డ్రైవ్‌లో భాగంగా వార్డు కౌన్సిలర్లు, మెప్మా విభాగం ఆర్పీలు, మహిళా సంఘాలు ఇంటింటికీ తిరిగి పరిసరాల పరిశుభ్రత పాటించి మురికి నీరు నిల్వల నుంచి వచ్చే వ్యాధుల బారిన పడొద్దని ప్రజలలో చైతన్యం తేవాలని మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఆదేశించారు. ప్రజలకు విష జ్వరాలు రాకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డి పల్లిని కలుపుకుని పట్టణంలోని 34వార్డుల్లో ఎమర్జెన్సీ స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌రాజనర్సు, మెడికల్‌ ‌కళాశాల ప్రిన్సిపల్‌ ‌తమిళ్‌ అరసు, వైద్య వర్గాలకు చెందిన అధికారులు, మున్సిపల్‌ ‌కమిషనర్‌ ‌శ్రీనివాస్‌ ‌రెడ్డిలతో పట్టణంలో చేపట్టాల్సిన ఎమర్జెన్సీ స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా హరీశ్‌ ‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన రోగులు డెంగీ వచ్చిందని.. ఆందోళన చెంది అనవసరంగా హైదరాబాదు పోవద్దని.., సిద్ధిపేట మెడికల్‌ ‌కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రిలోనే కావాల్సిన వైద్యం ఉచితంగా పొందాలని ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు ఉన్నాయని చెప్పారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కావాల్సిన డెంగీ కిట్స్ ఉన్నాయని, సీజనల్‌ ‌వ్యాధుల చికిత్సకు వైద్యం సిద్ధంగా ఉందని తెలిపారు.