వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

అవినీతి పాలనతో .. రాష్ట్రం అప్పులపాలు

November 12, 2019

ఫోటో: సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
ఫోటో: సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే
దేశ నలుమూల) భాజపా జెండా రెపరెపలు..!
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
‌రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హత్యలే అని బిజెపి రాష్ట్ర అధ్యక్ష్యడు లక్ష్మన్‌ అరోపించారు. సిద్ధిపేట జిల్లాలోని సిద్ధిపేట అర్బన్‌ ‌మండలం నాంచారు పల్లె గ్రామ శివారులో బిజెపి జిల్లా కార్యాలయ భవన నిర్మాణం మంగళవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ‌జిల్లా బిజెపి నేతలతో కలిసి భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ.. తె•రాస పాలన అవినీతిమయంగా మారిందని, దేశంలో అవినీతి పాలనలో కేసీఆర్‌ ‌ప్రభుత్వం ముందు ఉందన్నారు. ఉద్యమం సమయంలో ఆర్టీసీ కార్మికులుతో పెట్టుకుంటే అగ్గితోటి పెట్టుకున్నట్టే అని చెప్పిన కెసిఆర్‌ ఇప్పుడు అదే ఆర్టీసీ కార్మికులతో పెట్టుకొని చేతులు కాల్చుకొన్నారన్నారు. ఒక్క రోజు ఆర్టీసీ కార్మికుల ఉద్యోగానికి రాకుంటే డిస్మిస్‌ అని ప్రకటనలు చేస్తున్న కెసిఆర్‌ను ప్రజలు డిస్మిస్‌ ‌చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. రాష్ట్రంలో తెరాసకు ప్రత్యామ్నాయ పార్టీ బిజెపినే అని ప్రజలు లోక్‌సభ ఎన్నికలల్లో భాజపాకు పట్టం కట్టారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి రాష్ట్రంలో అధికార కైవసం దిశగా బిజెపి శ్రేణులు సన్న్ధ•ం కావాలని లక్ష్మణ్‌ ‌పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మి•• సంఘానికి గౌరవ అధ్యక్షునిగా పనిచేసిన మంత్రి హరీశ్‌రావు కార్మికుల గురించి మాట్లాడక పోవడం దారుణమన్నారు. రానున్న రోజులల్లో సిద్దిపేటలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమావ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన 25 జిల్లాలో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.
దేశ నలుమూల) భాజపా జెండా రెపరెపలు..!
దేశం నలుమూలల భారతీయ జనతాపార్టీ జెండ ఎగరడం ఖాయమని భారతీయన జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకొని దేశాన్ని సంస్కరణ బాట పట్టించిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. దేశాన్ని ఎన్నో పార్టీలు ఫలించాయి కానీ ప్రధాన సమస్యలకు పరిష్కరం చూపడంలో విఫలమయ్యాయన్నారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలకు పరిష్కారం చూపిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదే అన్నారు. దేశం వ్యాప్తంగా 9 కోట్ల మంది మహిళలకు ఉచితం గా గ్యాస్‌ ‌కనెక్షన్లు ఇచిన్నట్లు పేర్కొన్నారు. అగ్రవర్ణ పేదల కు 10 శాతం రిజర్వేషన్లు, ట్రెబుల్‌ ‌తలక్‌, 370 ఆర్టికల్‌ ‌రద్దు, రామమందిరం నిర్మాణం లాంటి సమస్యలకు ప్రధాని మోదీ పరిష్కారం చూపారన్నారు. ఎన్నో సంవత్సరాల కాలంగా అపరిష్కారానికి నోచుకొని సమస్యలకు గంటల వ్యవధిలోనే మోడీ పరిష్కరించరన్నారు. సాహస నిర్ణయం తీసుకున్న ఘనత కేవలం మోదీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. రామమందిర నిర్మాణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును దేశంలోని అన్ని పార్టీలు, అన్ని మతాల స్వాగతిస్తున్నాయన్నారు. ఈకార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు నరోత్తంరెడ్డి, నాయకులు వంగ రామచంద్రారెడ్డి, సొప్పదండి విద్యాసాగర్‌, ‌దూది శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.