వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆం‌ధ్రప్రదేశ్‌లో మద్యం వినియోగం రేటు తగ్గింది

December 4, 2019

ఆంధ్రప్రదేశ్‌ ‌లో మద్యాన్ని దశలవారీగా పూర్తిగా నిషేధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ ‌నేతృత్వంలోని మద్యం విధానం సత్ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో మద్యం వినియోగం రేటు బాగా తగ్గినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. నవంబర్‌ ‌నెలలో మద్యం విక్రయాలు 25 శాతం, బీర్‌ ‌విక్రయాలు 54 శాతం గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే తగ్గాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. 2018 నవంబర్‌ ‌లో మద్యం విక్రయాలు 29.62 లక్షల రూపాయిలు ఉండగా, 2019 నవంబర్‌ ‌లో 22.31 లక్షలు ఉన్నట్టు అంటే 25 శాతం తగ్గుదల ఉన్నట్టు ప్రభుత్వం వివరించింది. అలాగే, బీర్‌ ‌విక్రయాలు 54 శాతం తగ్గాయి. 2018 నవంబర్‌ ‌లో బీర్‌ ‌విక్రయాలు 17.80 లక్షల కేసులు ఉండగా, 2019 నవంబర్‌ ‌లో 8.13 లక్షల కేసులకు పడిపోయినట్టు ప్రభుత్వం వివరించింది. అయితే, మద్యం విక్రయాల ద్వారా ఆదాయంలో మార్పు లేదనీ, వినియోగంలో మాత్రం తగ్గుదల కనిపిస్తోందని ఎక్సైజ్‌ అధికారులు అదనపు రిటైల్‌ ‌పన్ను విధించినప్పుడు ఈ తేడా కనిపిస్తోందని అధికారులు వివరించారు. మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించడం, బెల్ట్ ‌షాపులను నిషేధించడం , పర్మిట్‌ ‌రూం లను నిషేధించడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకోవడం వల్లనే మద్యం వినియోగం తగ్గినట్టు ప్రభుత్వం పేర్కొంటోంది.