వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆగని ఆగ్రహం

December 2, 2019

హైకోర్టు ముందు లాయర్ల నిరసన
షాద్‌నగర్‌ ‌కోర్టులో పోలీసుల రిమాండ్‌ ‌పిటిషన్‌
‌పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఘటనలు
ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనిధి త్రిపాఠి
దిశ హత్యాచార ఘటనపై రాష్ట్రమంతటా నిరసన జ్వాలలు పెల్లుబికుతున్నాయి. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులు గడచినప్పటికీ నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌పై స్పందన లేకపోవడంతో నిరసనోద్యమాలు ఎల్లలు దాటుతున్నాయి. ఈ ఘటనపై రాష్ట్రంలో ఏ స్థాయిలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయో అంతే స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీ ,పశ్చిమ బంగ, బీహార్‌, ‌యూపీ, హర్యానా వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాగా, సోమవారం హైకోర్టు ధర్మాసనం ముందు కూడా ప్లకార్డులతో శాంతియుత నిరసన తెలిపి నిందితులను ఉరి తీయాలన్న ప్రజల డిమాండ్‌ను ప్రస్ఫుటం చేశారు. రాష్ట్రంలోని ప్రతీ చోటా నిరసనలు, ఆందోళనలు, శాంతియుత మౌన ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. భవిష్యత్తులో ఏ ఆడబిడ్డకూ ఇలాంటి దుర్ఘటనలు జరగరాదన్న ఆందోళనలు ప్రతిధ్వనిస్తున్నాయి. రాజకీయ పార్టీలు వ్యవస్థాగతంగా చేసే నిరసనల కన్నా అసంఘటితంగా వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నది. విచారణ, రిమాండ్‌, ఇం‌టరాగేషన్‌ ‌వంటి కాలయాపన చర్యలకు పాల్పడకుండా జనం ముందుకు తీసుకు రావాలని ఎక్కడికక్కడ ప్రజల నుంచి డిమాండ్‌ ‌వస్తున్నది. నిందితులను తామే శిక్షిస్తామనీ, విచారణల పేరుతో కాలయాపన చేయవద్దనీ లేదంటే ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టును ఏర్పాటు చేసి నిందితులను వెంటనే ఉరిశిక్ష అమలు వేయాలని ప్రజల వాదం. దిశపై అత్యాచారం, హత్యకు నిరసనగా…రాష్ట్ర లాయర్ల జేఏసీ హైకోర్టు వద్ద నిరసన వ్యక్తం చేసింది. క్యాండిల్‌ ‌ర్యాలీ నిర్వహించి దిశ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దిశ నిందితులకు ఉరిశిక్ష వేయాలనీ డిమాండ్‌ ‌చేశారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు వద్ద పెట్రోలింగ్‌ ‌పెంచాలనీ, సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో అత్యాచారం, హత్య ఘటనలపై స్పెషల్‌ ‌బెంచ్‌లు ఏర్పాటు చేసి బాధితులకు సత్వర న్యాయం చేయాలని పార్లమెంటులో క్రిమినల్‌ ‌ప్రొసీజర్‌ ‌కోడ్‌లో కూడా మార్పులు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. దిశ హత్యోదంతం కేసులో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్‌నగర్‌ ‌పోలీసులు సోమవారం షాద్‌నగర్‌ ‌కోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేశారు. ఈ కేసులో నిందితులను మరింత లోతుగా విచారణ జరిపేందుకు వీలుగా 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్డు రేపటికి వాయిదా వేసింది. ఇంచార్జ్ ‌పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ అం‌దుబాటులో లేకపోవడంతో వాయిదా వేశారు.
పాలకపక్షంపై మండిపడ్డ విపక్షాలు
దిశ హత్యాచార ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విపక్షాలు ధ్వజమెత్తాయి. మహిళలపై అత్యాచారాలు, హత్య
లతో రాష్ట్రం అట్టుడుకుతోందని మండిపడ్డాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాసయాదవ్‌ ‌మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ‌వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యంతో • అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్‌ ‌నగర బ్రాండ్‌ ఇమేజ్‌కు భంగం వాటిల్లిందని ధ్వజమెత్తారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాని మాజీ మంత్రి డీకే అరుణ పేర్కొన్నారు. కఠినంగా శిక్షలు పడేలా చట్టాలలో మార్పులు తీసుకొచ్చే వరకు ఉద్యమాలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫాస్ట్‌ట్రాక్‌ ‌కోర్టులు పెట్టడం మాత్రమే కాదు, నెల రోజులలోపు నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా చూడాలన్నారు. నాలుగు రోజులలో అందరూ మరచిపోతారని కేసీఆర్‌ అనుకుంటున్నారనీ, అంతర్జాతీయ స్థాయి నగరమని అంటున్న హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దిశ ఘటనపై పశు సంవర్ధక శాఖ మంత్రి పశువులా ప్రవర్తించారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌నేత నాగం జనార్ధనరెడ్డి వ్యాఖ్యానించారు. దిశ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికీ సీఎం నిందితులపై కరిన చర్యలు తీసుకునే విషయంపై స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
దిశ ఘటనపై ఏబీవీపీ మహా నిరసన ర్యాలీ
తక్షణం ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్టు ఏర్పాటుచేయాలి
నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలి
పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఘటనలు
ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనిధి త్రిపాఠి
హైదరాబాద్‌ ‌శివారులో జరిగినటువంటి ప్రియాంక అత్యాచారం, పాశవిక హత్యను నిరసిస్తూ ఏబీవీపీ వేలాదిమంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించింది. బాగ్‌లింగంపల్లి పార్క్ ‌నుండి ఇందిరా పార్క్ ‌వరకు పోలీసుల వలయాలను ఛేదించుకుంటూ ర్యాలీ తీసారు. అనంతరం ఇందిరా పార్క్ ‌వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీనిధి త్రిపాఠి మాట్లాడుతూ తెలంగాణలో జాతీయ జెండా కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన జగన్‌ ‌మోహన్‌ ‌రెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఏబీవీపీ ముందుకెళ్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దురదృష్టవశాత్తు తెలంగాణా లో జరుగుతున్న వరుస సంఘటనలను ఏబీవీపీ దేశ వ్యాప్తంగా నిరసనలతో తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. కేవలం పోలీసుల, ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. వరంగల్‌ ‌కేంద్రంగా 9 నెలల పసిపాప పై అత్యాచారం కావచ్చు, మానస సంఘటన కావచ్చు, నగర శివారులో జరిగినటువంటి ప్రియాంక అత్యాచారం, పాశవిక హత్య కావచ్చు ఇవన్నీ కేవలం పోలీసుల నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ అలసత్వం కారణంగానే జరిగిందని, ఆమె పోలీసుల , ప్రభుత్వ పనితీరుపై తీవ్రంగా మండిపడ్డారు. బాధితురాలి పై •మ్‌ ‌మినిస్టర్‌ ‌బాధ్యతరాహిత వ్యాఖ్యలు వారి పనితీరుకు నిదర్శనమని, రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు సరికాదన్నారు. వారిని వెంటనే కేబినెట్‌ ‌నుండి బర్తరఫ్‌ ‌చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలను అవమానపరిచే విధంగా వ్యవహరిస్తుందని, ప్రియాంక సంఘటనపైనా కనీసం స్పందించకుండా ముఖ్యమంత్రి ఎలక్షన్‌లలో విజయం సాదించినపుడు ప్రెస్‌ ‌ట్‌ ‌పెట్టి గొప్పలకు పోయే ముఖ్యమంత్రి ఈ రోజు నిస్సహాక స్థితిలో దారుణంగా హత్య గావింపబడ్డ తెలంగాణా ఆడపడచు ప్రియాంక విషయంలో ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నించింది. దేశమంతా ఒకవైపు దిగ్బ్రాతికి లోనై శోకసముద్రంలో మునికిగినప్పటికీ సీఎం ఆర్టీసీ కార్మికులతో విందు భోజనాలు చేయడం కేవలం అయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అన్నారు. ఎక్కువ సంఖ్యలో లైంగిక వేధింపుల కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయని, శంషాబాద్‌ ‌లో బాదితురాలు హత్యకు గురైన ఆ స్పాట్‌ ‌కి వెళ్ళినపుడు ఆ పరిస్థితిని చూసి, అత్యాచారానికి గురైన ప్రియాంక ఆవేదన నేను అర్ధం చేసుకోగలను. బాధితురాలికి రక్షణ కల్పించలేకపోయిన పొలిసు వ్యవస్థ, నిందితులకు మాత్రం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమేంటని ఈ సందర్బంగ ఆమె ప్రశ్నించారు, తాను ఇక్కడకు రావడానికి ప్రధాన కారణం ఈ పోరాటంలో తెలంగాణ ఆడపడచుకు దేశమంతా మద్దతు ఉందని తెలపటం కోసమేనని అన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఇలాగే దేశ వ్యాప్త ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని, మహిళా భద్రతే దేశ భద్రత అన్నారు. వెంటనే ఫాస్ట్ ‌ట్రాక్‌ ‌కోర్ట్ ‌ల ద్వారా అత్యాచారం చేసిన నిందితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్‌ ‌చేసారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సహా సంఘటన కార్యదర్శి గుంత లక్ష్మణ్‌, ‌రాష్ట్ర సంఘటన కార్యదర్శి నిరంజన్‌, ‌సహా సంఘటన కార్యదర్శి శివకుమార్‌, ‌జాతీయ కార్యదర్శి ఐనాల ఉదయ్‌ , ‌సెంట్రల్‌ ‌వర్కింగ్‌ ‌కమిటి మెంబర్‌ ‌ప్రవీణ్‌ ‌రెడ్డి , గ్రేటర్‌ ‌హైద్రాబాద్‌ ‌మహానగర కార్యదర్శి శ్రీహరి, జాతీయ కార్యవర్గ సభ్యులు అభిషేక్‌, ‌స్వరూప , ఎల్లస్వామి, శ్రావణ్‌ ‌రెడ్డి, అంబికా, శిరీష, తదితర నాయకులూ పాల్గొన్నారు.