వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.25లక్షలు చెల్లించాలి బిజెపి నేత బండారు దత్తాత్రేయ

May 8, 2019

విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన బిజేపి నేత దత్తాత్రేయ
విద్యార్థి కుటుంబాన్ని పరామర్శించిన బిజేపి నేత దత్తాత్రేయ

తెలంగాణ ప్రభు త్వం తప్పిదం వల్ల ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా క్రింద రూ. 25లక్షలు చెల్లిం చాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్‌ ‌చేశారు. మంగళవారం దర్గా కాజీపేటలో ఆత్మహత్య చేసు కున్న మూడం భానుకిరణ్‌ ఇం‌టికి వెళ్ళి ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. కిరణ్‌ ‌తల్లిదండ్రులు సత్యనారాయణ, రమలను ఓదార్చారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ విద్యార్థులకు ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్‌బోర్డు వ్యవహారంపై సిట్టింగ్‌ ‌జడ్జిచే విచారణ చేపట్టాలని, గ్లోబరినా సంస్థపై చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 26మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఇంటర్‌బోర్డు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ నోరు మెదపక పోవడం విడ్డూరమన్నారు. పరీక్ష ఫలితాలపై న్యాయ విచారణ జరిపితే అసలు దోషులెవరో బయటప డుతారని, ఫలితాల అవకతవకలకు కారకులైన వారిపై చర్యలు తీసుకునేంత వరకు పోరాటాలు సాగుతాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యవర్గ సభ్యులు బేరాలు శేఖర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ ఎస్‌.‌మల్లారెడ్డి, భరత్‌గౌడ్‌తో పాటు స్థానిక నాయకులు ఏనుగు రాకేష్‌రెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, నరేందర్‌, ‌సంతోష్‌రెడ్డి, జగదీశ్వర్‌, ‌శివాజీ, నరసయ్యగౌడ్‌, ‌సురేష్‌, ‌హరీష్‌, ‌శంకర్‌, ‌జీవన్‌, ‌వెంకట్రావు, బిజెపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.