వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీని సమాధి చేసే కుట్ర

October 9, 2019

అఖలపక్ష భేటీలో మండిపడ్డ కోదండరామ్‌
ఉద్యోగుల పిఎఫ్‌ను వాడుకున్నారన్న థామస్‌ ‌రెడ్డి
ఆర్టీసీని సమాధి చేయాలని కుట్ర జరుగుతోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరాం అన్నారు. ప్రజాస్వామ్యంలో విచారణ లేని శిక్షణ ఉండదని, అన్నారు. ఆర్టీసీ విషయంలో సిఎంకెసిఆర్‌ ‌నిరంకుశ వైఖరి అవలంబిస్తున్నారని, రేపు రేపు అన్ని ఉద్యోగాలకు సంబంధంచి ఇదే వైఖరి ఉండబోతున్నదని అన్నారు. బుధవారం ఆర్టీసీ అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు ఆర్టీసీ కార్మికులను డిస్మిస్‌ ‌చేయడానికి లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీరు అప్రజాస్వామికమని విమర్శించారు. ఆర్టీసీని నిలబెట్టేందుకు కార్మికులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ ‌నిరంకుశ పాలన అంతం కావాలని పిలుపు ఇచ్చారు. పండగ ముందు సమ్మె జరగొద్దనే స్ప•హ సీఎంకు ముందే ఉండాలని కోదండరాం అన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి సీఎం కేసీఆర్‌ ఆర్టీసీని సమాధి చేసేందుకు రెడీ అవుతున్నారని కోదండరాం ఆరోపించారు. ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ఉద్యమ ద్రోహులైన అప్పటి లీడర్లు ఇప్పటి మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఒక్కడే ఉన్నడని? సమాజం మొత్తం ఆర్టీసీకి మద్దతు ఇస్తుందని చెప్పారు. దేశంలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చుడు సులభం కానీ? ఊడపీకటం ఎవని తరం కాదని? సమ్మె చేస్తున్న వాళ్లకు ప్రభుత్వం ముందుగా నోటీసు ఇవ్వాలని.. చేసిన నేరాన్ని బట్టే శిక్ష ఉంటదని? ఏ చిన్న నేరానికైనా ఉద్యోగాన్ని తీయలేరని అన్నారు. దేశ ద్రోహం చేసినప్పుడు తప్ప, నోటీసు ఇవ్వకుండా ఉద్యోగాన్ని తీసేయలేరు.. ఇది ఏ ప్రజాస్వామ్యం ఒప్పుకోదు.. ప్రజాస్వామ్యంలో విచారణ లేని శిక్ష ఉండనే ఉండదని అన్నారు. ముఖ్యమంత్రి నేనే చట్టం, నేనే రాజ్యంగం అని అనుకుంటున్నరని ఘాటుగా విమర్శించారు. ఎర్రమంజిల్‌ ‌విషయంలో ఎలా అయితే కేసీఆర్‌ ‌భంగపడ్డాడో.. ఆర్టీసీ విషయంలో అలాగే భంగ పడ్తడని అన్నారు.. ఇప్పుడు గనుక ప్రజలు, మిగితా ఉద్యోగ సంఘాలు నిద్రలేవకపోతే? భవిష్యత్తులో అందరూ అన్యాయం అయితరని అన్నారు. ఆర్టీసీ లేకపోతే ఆర్థిక వ్యవస్థ లేదు.. ఇది గుండె లాంటిదని చెప్పారు. ఆర్టీసీని నిలబెట్టుకునేందుకే కార్మికులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అడిగితే ఉద్యోగులకు కూడా ఆర్టీసి కార్మికులకు జరిగినట్టే జరుగుతుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కాగా ఆర్టీసీ అఖిలపక్ష సమావేశం గురువారం) సాయంత్రం 3గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఆర్టీసీని ప్రైవేట్‌ ‌పరం చేసేందుకు సీఎం కేసీఆర్‌ ‌కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు ఆర్టీసీ జేఏసీ నేత థామస్‌ ‌రెడ్డి. ఆర్టీసీకి ఇవ్వాల్సిన రాయితీలను ఇంతవరకు ఇవ్వలేదున్నారు. కార్మికుల ఫీఎఫ్‌ ‌డబ్బులను ప్రభుత్వం వాడుకుందని? పండగపూట వారికి జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందన్నారు. కార్మిక చట్టాల ప్రకారమే సమ్మె నోటీసులిచ్చామన్నన థామస్‌ ‌రెడ్డి.. కార్మిక సంఘాలను చర్చలకు పిలవక పోవడం దారుణమన్నారు. కార్మికులను బయపట్టాలని ప్రభుత్వం చూస్తోందని..అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదన్నారు. కార్మికులెవరూ ఆందోళన చెందవద్దని.. ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని థామస్‌ ‌రెడ్డి తేల్చి చెప్పారు.