వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీపై వేగంగా చర్యలు

November 30, 2019

రేపు కార్మికులతో ముఖ్యమంత్రి  భేటీ
ప్రగతిభవన్‌ ‌వేదికగా నేరుగా సిఎం కెసిఆర్‌ ‌చర్చలు
ఆర్టీసీ యూనియన్‌ ‌నేతలకు షాక్‌..‌కార్యాలయాలకు తాళాలు
ఇక వారు డ్యూటీలో చేరి పని చేయాల్సిందే

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకున్న సిఎం కెసిఆర్‌ ఇప్పు‌డు అంతే వేగంగా పావులు కదుపుతున్నారు.  ఆర్టీసీ యూనియన్‌ ‌కార్యాలయాలకు  తాళాలు వేయించాలరు. అలాగే వారు కూడా ఖచ్చితంగా విధులకు హజారయ్యేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపోతే కార్మికులతో నేరుగా చర్చించేందుకు సిద్దం అయ్యారు. ఇందులో భాగంగా ప్రగతిభవన్‌లో వచ్చే ఆదివారం ఆర్టీసీ కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సమావేశం కానున్నారు. 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో సీఎం ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రతిడిపో నుంచి ఐదుగురు కార్మికుల చొప్పున సమావేశానికి ఆహ్వానించ నున్నారు. కార్మికులను ప్రగతిభవన్‌కు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. సమావేశానికి రవాణాశాఖ మంత్రి అజయ్‌ ‌కుమార్‌తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్‌ఎం‌లు, డీవీఎంలకు ఆహ్వానం పంపారు. ఐదుగురిలో కచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలి. అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలి. మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను