వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌.. ‘‌దీక్షా దివస్‌’ ‌గిప్ట్

November 28, 2019

తెలంగాణ సాధన మలిదశ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌చేపట్టిన ఆమరణ దీక్ష కీలక మలుపు తిప్పింది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2009 నవంబర్‌ 29‌న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో కేసీఆర్‌ ‌చేపట్టిన ఆమరణ దీక్ష డిసెంబర్‌ 9‌న కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు దోహదపడింది.సరిగ్గా 10 సంవత్సరాల తరువాత ఇదే రోజు గత 52 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు ముగింపు పలుకుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ ‌రావు కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించి తీపి కబురు అందించారు.