వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి

November 21, 2019

పార్లమెంట్‌ ఆవరణలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఎంపీలు అరవింద్‌, ‌సంజయ్‌
పార్లమెంట్‌ ఆవరణలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో ఎంపీలు అరవింద్‌, ‌సంజయ్‌

ప్రభుత్వం కక్షసాధింపు వైఖరివీడాలి
– కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం కక్షసాధింపు వైఖరి వీడాలని, ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కేంద్ర శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్రశాఖ సహాయమంత్రి కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్‌, ‌ధర్మపురి అరవింద్‌, ‌సోయం బాపురావు గురువారం గడ్కరీని కలిశారు. అనంతరం కిషన్‌రెడ్డి డియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నితిన్‌ ‌గడ్కరీని కోరినట్టు వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని నితిన్‌ ‌గడ్కరీ హా ఇచ్చినట్లు తెలిపారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరిని విడిచిపెట్టాలని సూచించారు. ఎలాంటి షరతులు లేకుండా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి చేర్చుకుని, వారి కనీస డిమాండ్లను నెరవేర్చాలని కిషన్‌రెడ్డి కోరారు. తమ వినతిపై గడ్కరీ సానుకూలంగా స్పందించారని అన్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఇంఛార్జి ఎండీ సునీల్‌ ‌శర్మ సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తే ఏం చేయాలి అనే అంశంపై చర్చించనున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు విధించాలి, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో దృష్టి పెట్టనున్నారు. భేటీ తర్వాత సీఏం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో అధికారులు కలవనున్నారు.
విధులకు వొచ్చిన కార్మికులు
చేర్చుకోమన్న అధికారులు : ఎలాంటి షరతులు లేకుంటే విధుల్లో చేరేందుకు సిద్ధమని పలుచోట్ల ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల డిపో మేనేజర్‌ శ్రీ‌నివాసరావును 280 మంది కార్మికులు కలిసి వెంటనే విధుల్లో చేర్చుకోవాలని కోరారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, ఆదేశాలు వచ్చిన వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకుంటామని డిఎం చెప్పడంతో కార్మికులు వెనుదిరిగారు. విధుల్లో
చేరేందుకు సిద్ధమని హన్మకొండ డిపోలో పని చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ప్రకటించారు. గుండెపోటు, అనారోగ్యంతో పాటు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోందన్న కార్మికులు… ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ ‌డిపో వద్ద 300 మంది, మహేశ్వరం డిపో వద్ద 60 మంది కార్మికులు విధుల్లో చేరతామని అధికారులను కోరారు. 48 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించిన కేంద్రం
కేసీఆర్‌తో మాట్లాడుతా: గడ్కరీ
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై కేంద్రం స్పందించింది. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడతానని.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అధికారులను ఢిల్లీకి పిలిపించి సమావేశం నిర్వహిస్తానని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరీ తెలిపారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ ‌రెడ్డి, బీజేపీ తెలంగాణ ఎంపీలు బండి సంజయ్‌, ‌ధర్మపురి అరవింద్‌, ‌సోయం బాపురావు గురువారం గడ్కరీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన తమకు ఈ మేరకు హామీయిచ్చినట్టు కిషన్‌రెడ్డి తెలిపారు. ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉందని ఆయన తెలిపారు.
అధికారులతో కేసీఆర్‌ ‌సమీక్ష
ఆర్టీసీ కార్మికులు బేషరుతుగా సమ్మె విరమించి విధుల్లోకి వొస్తామని అంటున్న నేపథ్యంలో వారిని తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే విషయమై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతున్నారు. కార్మికులను విధుల్లోకి తీసుకోవాల్సి వస్తే ఎలాంటి షరతులు విధించాలి, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సమావేశంలో చర్చిస్తున్నారు.