వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఆర్టీసీ సమ్మె.. అహంకారానికి.. ఆత్మగౌరవానికి మధ్య పోరు -కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

November 12, 2019

ఫోటో: ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
ఫోటో: ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

ఆర్టీసీ కార్మికుల విషయంలో సిఎం కెసిఆర్‌ ‌తీరును ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ఆర్టీసీ కార్మికులను తీసేసే అధికారం సిఎం కెసిఆర్‌కు లేదని, సిఎం కెసిఆర్‌ను తీసేసే అధికారం ప్రజలకు ఉందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మెకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమంలో ప్రథమ స్థానంలో నిలిచింది ఆర్టీసీ కార్మికులే అన్నారు. దాదాపు కోటి జనాభాకు రవాణా సదుపాయం కల్పించింది ఆర్టీసీ కార్మికులే అన్నారు. సిఎం కెసిఆర్‌ ‌మెండి వైఖరి మూలంగా రెండు మాసాల నుంచి పండుగలు దూరం చేసుకొని ఆర్టీసీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారన్నారు. సిఎం కెసిఆర్‌ ఆహంకార ధోరణితో కార్మికులకు డెడ్‌ ‌లైన్‌లు పెట్టడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికుల ఈ ఉద్యమం సిఎం కెసిఆర్‌ ఆహంకారానికి, ఆర్టీసీ కార్మికుల ఆత్మ గౌరవానికి మద్య జరుగుతోందన్నారు. అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్న కార్మికులు ఆర్టీసీలే అన్నారు. తెరాస ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల పట్ల సమితి తల్లి ప్రేమ చూపుతున్నారన్నారు. ఆర్టీసీ మంత్రిగా ఉన్నప్పుడు లాభాలు తెచ్చిన అని చెప్పుకునే కెసిఆర్‌ ఇప్పుడు సిఎంగా లాభాల బాట పట్టించలేరని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఆర్టీసీ కి రావలసిన మూడు వందల కోట్లు ఇవ్వాలని అయ్య బిల్లు పాస్‌ ‌చేస్తే వద్దని కొడుకు ఆపిండని ఆరోపించారు. ఒకవేళ ఆర్టీసీ నష్టానికి కార్మికులే భారమైతే మరి ఆంధ్రలో ఎందుకు కాలేదన్నారు. సిఎం నిరుద్యోగ యువత పట్ల వివక్ష చూపుతున్నారన్నారు. నష్టాలతో ఏదైనా సంస్థ రద్దు చేయాలంటే మొట్టమొద•గా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయాల్సి ఉంటుందన్నారు. కెసిఆర్‌ ‌ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రెండు లక్షల అరవై వేల కోట్ల అప్పు చేశాడని విమర్శించారు. సిఎం కెసిఆర్‌ను తీసేసే అధికారం ప్రజలకు ఉంది కానీ కార్మికులను తీసేసే అధికారం కెసిఆర్‌కు లేదన్నారు. దేశంలోనే అన్నిటికంటే ఎక్కువ జాతీయ అవార్డు పొందే ఏకైక సంస్థ ఆర్టీసీ యే అన్నారు. ఎంపి కేశవరావు, మంత్రి హరీష్‌ ‌రావు ఇప్పటికైనా కార్మికుల పక్షాన నిలబడాలని హితవుపలికారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు తూకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెసు పార్టీ ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. హరీష్‌రావు కు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోవడం లేదన్నారు. సిద్దిపేట లో ట్రిపుల్‌ ‌షూటర్‌ అని చెప్పుకునే హరీష్‌ ‌రావు పథనం కూడా సిద్దిపేట నుండే ప్రారంభం అవుతదని జోష్యం పలికారు. ఈకార్యక్రమంలో ఆర్టీసీ జెఎసి నాయకులు, కాంగ్రెస్‌ ‌నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని జిల్లా కాంగ్రెస్‌ ‌నాయకులు శాలువతో ఘనంగా సన్మానించారు.