వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయండి

May 9, 2019

సీఈసీకి పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌లేఖతెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు సీఈసీ సునీల్‌ అరోడాకు లేఖ రాశారు. ఈ విషయంపై బుధవారమే ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌ద్వారా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు విన్నవించిన ఉత్తమ్‌.. ‌తాజాగా గురువారం మరో లేఖ రాశారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఓటర్ల జాబితా అందుబాటులో లేదని, అయినా రంగారెడ్డి, నల్గొండ, వరంగల్‌ ‌జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ ‌రజత్‌కుమార్‌ ‌ప్రకటన విడుదల చేశారని వివరించారు. ఓటర్ల జాబితా లేకుండా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఉత్తమ్‌ అన్నారు.