వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

‘ఎ‌ర్రమంజిల్‌’ ‌కూల్చివేత తగదు

September 16, 2019

  • హైకోర్టు తీర్పు.. ప్రభుత్వానికి ఊహించని షాక్‌
  • అసెంబ్లీ నిర్మాణంపై మంత్రి మండలి తీర్మానం చెల్లదని స్పష్టీకరణ
  • పురాతన భవనాల కూల్చివేతను తప్పుపట్టిన ధర్మాసనం 

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని షాక్‌ ‌తగిలింది. ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాలను కూల్చి నూతన అసెంబ్లీని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టిపారేసింది. ఈ మేరకు మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని కోర్టు తిరస్కరించింది. అసెంబ్లీ నిర్మాణం కోసం ప్రస్తుత ఎర్రమంజిల్‌లోని చారిత్రాత్మక భవనాలను కూల్చి ఆ స్థానంలో కొత్త భవనాలకు తెలంగాణ ప్రభుత్వం భూపూజ కూడా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం కూడా ఏకగ్రీవం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్‌ ‌భవనాలను కూల్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ కలిపి ఉమ్మడిగా విచారించిన ధర్మాససం సుధీర్ఘ వాదనల అనంతరం సోమవారం తన తీర్పును వెలువరించింది. పురాతన భవనాల కూల్చివేతను తప్పుపడుతూ.. వాటిని కూల్చివేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఎర్రమంజిల్‌ ‌లో మొత్తం  16 ఎకరాల స్థలంలో కొత్త అసెంబ్లీ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోంది. దీని నిర్మాణం నిమిత్తం జూన్‌ 27‌న సీఎం కేసీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు. వచ్చే ఉగాది పండగ లోపు కొత్త అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఎర్రమంజిల్‌ ‌భవనాల కూల్చివేతపై జూలై 3 నుంచి హైకోర్టులో పలు దఫాలుగా వాదనలు సాగుతోన్న విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదిస్తూ.. భవనాలను కూల్చివేసి వాటి స్థానంలో కొత్తవాటిని నిర్మించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొత్త భవనం నిర్మిస్తే ట్రాఫిక్‌ ‌సమస్యతో తలెత్తడంతోపాటు పురాతన కట్టడాలను పరిరక్షించాల్సిన ప్రభుత్వ బాధ్యతను విస్మరించినట్టు అవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం  ప్రభుత్వ నిర్ణయాన్ని తొసిపుచ్చింది. ఇదిలావుండగా.. తాజా హైకోర్టు తీర్పుతో ప్రభుత్వ తదుపరి నిర్ణయంపై ఆసక్తినెలకొంది. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందింస్తో వేచి చూడాలి. ఇకపోతే ప్రస్తుత అసెంబ్లీ భవనం పూర్తిగా అందుబాటులో ఉందని కూడా పిటిషనర్లు వాదించారు. వీరివాదనలను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. పభుత్వ నిర్ణయంపై ప్రజా సంఘాలు, స్వచ్చంద సంస్థలు తీవ్రంగా స్పందించాయి. వారసత్వ సంపదగా ఉన్నఈభవనం కూల్చివేయవద్దని ఆందోళనలు చేపట్టాయి.ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలుసంస్ధలు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలుచేశాయి. దీనిపై హైకోర్టు విచారణ జరిపి సోమవారం తీర్పువెలువరించింది.