వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఏకదంతునికి అంకురార్పణకు ఆదర్శం మిట్టపల్లి..

September 2, 2019

– ఒకే వినాయకుడు ఏర్పాటు చేసిన మిట్టపల్లి గ్రామంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు …
ప్రకృతిని ప్రేమించే.. దేవున్ని పూజించే గొప్ప పండగ వినాయక చవితి..ఏకదంతుని కోసం ఏకమైంది..స్పూర్తిగా నిలిచింది మిట్టపల్లి గ్రామం అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు  అన్నారు..సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఒకే వినాయకుడు ఏర్పాటుకు స్పూర్తిని చాటుకున్న సందర్భంగా వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు పూజ కార్యక్రమంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు శ్రీశ్రీశ్రీ త్రిదండీ దేవనాథ జీయర్ స్వామి వారితో కల్సి పూజల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐక్యతకు మారు పేరుగా ఆదర్శంగా నిలిచింది మిట్టపల్లి గ్రామం అని అన్నారు.. సిద్దిపేట లో ఏది చేసిన ఒక ప్రత్యేకత ఉంటుంది..అభివృద్ధిలో కాని నేను ఇచ్చే పిలుపుతో మీరు చూపే చైతన్యం గొప్పది అని ఒక గ్రామంలో ఒక వినాయకుడు మట్టి వినాయకుడు ఏర్పాటు చేయాలని చెప్పాగానే తోలి తీర్మానం ఇచ్చింది..స్పూర్తితో చాటింది మిట్టపల్లి గ్రామం అని అన్నారు… తొలి రోజు పూజ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండీ దేవనాథ జీయర్ స్వామి వారు పర్యవేక్షణ లో ఈ పూజ జరగడం అదృష్టంగా భావిస్తునన్నారు.. మట్టి వినాయకులను పూజిద్దాం అని ఒక గోప్ప కార్యక్రమం మన సిద్దిపేట నుండే మొదలు అయిందన్నారు..పర్యావరణ పరిరక్షణ కు మట్టి వినాయకుల ఏర్పాటు చేయడం అభినందనియమని.. ” ఒకే వినాయకుడు అది మట్టి వినాయకుడు ” అనే నినాదం ఈ గ్రామం నుండే ప్రారంభం అయిందన్నారు.. ఏ పూజ చేసిన ఏ శుభకార్యాలు అయిన మొదట పూజించేది విగ్నేశ్వరున్నే అని… అన్ని విఘ్నలు తొలగాలి విగ్నేశ్వరున్ని కొలుస్తామని చెప్పారు…. అందుకేనెమో గ్రామ ఐక్యత విగ్నేశ్వరుని పూజతో మొదలైందన్నారు.. మనకు ఉన్న చిన్న చిన్న విఘ్నాలు తొలగించి అందరికి శుభం జరిగేలా ఆ విగ్నేశ్వరున్ని వేడుకొన్నారు.. సిద్దిపేట కు ఈ వినాయక చవితి ఒక ప్రత్యేకత చాటుకుంది.. గ్రామంలో ఒక వినాయకుడు ఏర్పాటు చేయాలని పిలుపు నిస్తే ఈరోజు 40 గ్రామాలు ముందుకు వచ్చాయి..ఏకగ్రీవ తిర్మనాలు ఇచ్చారన్నారు.. అంటే సిద్దిపేట గ్రామాల ఐక్యతకు..యువత చైతన్యానికి నిదర్శనం..ఈ సందర్భంగా అన్ని గ్రామాల ప్రజలను..యువతను ఈ సందర్భంగా అభినందిస్తునన్నారు ఈ స్పూర్తితో చాలా గొప్పది అని సిద్దిపేట లో మొదలైంది రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ , ఖమ్మం ఇలా అన్ని జిల్లాలో ఒక గ్రామంలో ఒకే వినాయకుడు నినాదం మారు మ్రోగిందని చెప్పారు..
– ప్రత్యేక పూజలు నిర్వహించాలి..
– గ్రామ ఐక్యత యువత చైతన్యం గొప్పది…
– మిట్టపల్లి యువతకు సర్ప్రైజ్ గిఫ్ట్ అందెజేసిన మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు
గ్రామానికి ఒక్కవినాయకుడు..మట్టి వినాయకుడు అనే కార్యక్రమ ఉదేశ్యం గ్రామం ఐక్యతతో ఉండాలి…యువత ఏక తాటి పై రావాలి.. గ్రామం అంత కల్సి మెలిసి సామూహిక పూజలు చేయాలి..నవరాత్రుల్లో గ్రామం అంత ఒక ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకోవాలి అనే స్పూర్తి తీసుక రావడానికె అని ఈ సందర్భంగా చెప్పారు.. కొన్ని ప్రత్యేక పూజలు చేద్దాం విగ్నేశ్వరునికి శ్రేష్టమైనది గరిక అని అందుకే ఒక రోజు లక్ష గరిక తో అర్చన, మరో రోజు లక్ష పుష్పార్చన, మరో రోజు మహిళలచే సామూహిక కుంకుమార్చన , ఉండ్రాళ్ళ పూజ, చెప్పన్ భోగన్ 41 రకాల ప్రసాదాలు , సాంస్కృతిక , ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిద్దాం బ్రహ్మాండంగా చేద్దామని ఈ సందర్భంగా చెప్పారు.. వినాయకుడు ఎలా ఉండడం కాదు మనమంతా ఎంత భక్తీ శ్రద్ధలతో పూజ చేసాము అనేదే ముఖ్యమన్నారు.. ఒక వినాయకుడు ఏర్పాటు లో ప్రతి ఒక్కరు కృషి చేసారు..మహిళలు , యువజన సంఘాలు ఈ సందర్భంగా అభినందించారు.. గ్రామములో ఒకే వినాయకుడు ఏర్పాటు చేస్తే యూత్ కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పాను ఈ సందర్భంగా మిట్టపల్లి యువత కు వాలి బాల్ , నెట్ సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చారు..యువత క్రిడా నైపుణ్యాలను పెంచుకోవాలని , చెడు వ్యసనాలకు దూరం కావాలని ఈ గణనాథుని నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదిశగా అడుగులు వేయాలన్నారు…
– చెన్న కేశవ ఆలయ ప్రతిష్టా కార్యక్రమం ఘనంగా చేద్దాం…
గ్రామంలో ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకునే విధంగా పురాతనమైన ఆలయం శ్రీ చెన్న కేశవ ఆలయా పునరుద్ధరణ పనులను దేవనాథ జీయర్ స్వామి వారితో కల్సి సందర్శించారు..ఈ సందర్భంగా మాట్లాడుతూ చెన్న కేశవ ఆలయం పునరుద్ధరణ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు.ప్రాచీన ఆలయాలకు పూర్వ వైభవాన్ని తెస్తున్నమని చెప్పారు.. చెన్న కేశవ ఆలయం 30 లక్షలు మంజూరు చేశామని, పనులు పూర్తి దశకు చేరుకున్నాయన్నారు.. త్వరలోనే చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణ లో అద్బుతంగా ప్రతిష్టా కార్యక్రమంలో చేసుకుందామన్నారు..అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు..
– ఒకే వినాయకుడు ఏర్పాటు చేసిన గ్రామాల్లో ప్రత్యేక పూజలు…
– ఈరోజు మిట్టపల్లి గ్రామంలో రోజుకో పూజ చొప్పున ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు .
చిందు కళాకారుల కార్యక్రమం.. అందరిని అలరించే ఈటీవీ జబర్దస్త్ టీమ్ తో కార్యక్రమం.అదేవిధంగా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు..
– అదేవిధంగా గుర్రాల గొంది గ్రామంలో  మిద్దె రాజేశం వారి బృందం చే ఒగ్గు కథ , కోలాటం, పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు… బతుకమ్మ సంబరాలు ..