వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఏపిలో రాజధాని రాజకీయాలు

November 28, 2019

చంద్రబాబు జగన్‌ ‌మీద వేసిన అస్త్రాలన్నీ తిరిగి ఆయనకే వచ్చి తగులుతున్నాయి. ఇసుక కొరత, ఆంగ్ల మాధ్యమం, అంశాల్లో చంద్రబాబు పోరాటాలు, ఆయనకు అత్యంత ఆంతరంగికునిగా వ్యవహరిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ ‌కల్యాణ్‌ ఆం‌దోళనలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు రాజధాని అంశాన్ని అడ్డు పెట్టుకుని జగన్‌ను బద్నామ్‌ ‌చేయాలని చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న మీడియా ప్రయత్నిస్తున్న సంగతి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గ్రహించారు. మంత్రి బొత్స నోటివెంట వచ్చే ప్రతి మాటా జగన్‌ ‌పలికిస్తున్నవేనని చంద్రబాబు, పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రచారం చేస్తున్నారు. బొత్సతో పాటు కొడాలి నాని వంటి మంత్రుల ప్రకటనలు జగన్‌కు చేటు తెచ్చేవిగా ఉన్నాయి. వారిని అదుపు చేయకపోతే జగన్‌ ‌నష్టపోతారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసింది పబ్లిసిటీ, గ్రాఫిక్స్ ‌తప్ప ఏమీ లేదన్న సంగతి అందరికీ తెలుసు. ఆ విషయాన్ని అదే భాషలో చెప్పాలి కానీ, స్మశానాల ప్రస్తావన తీసుకుని రావడం వల్ల అధికార పార్టీపై ఇప్పటికే మరక పడింది.ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అమరావతిపై చాలా హాట్‌ ‌హాట్‌ ‌రాజకీయాలు నడుస్తున్నాయి అధికార, ప్రతిపక్ష నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు మాట్లాడుతుండటంతో అమరావతి ఇమేజ్‌ ‌దెబ్బతింటోందన్న ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతోంది. తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తానని ప్రకటనలు చేస్తూ ఐదేళ్ళ పుణ్య కాలాన్ని గడిపేశారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలను ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌పేరిట సేకరించారు. ఈ భూమిలో పారిశ్రామిక వాడలను నిర్మిస్తామనీ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని వాగ్దానాలు చేశారు. ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్క దానిని కూడా నిలబెట్టుకోలేదు. ఇందుకు పూర్తిగా ఆయనే బాధ్యులు కారు. రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమరావతిని ఢిల్లీ తరహాలో అభివృద్ధి చేసేందుకు సాయపడతామన్నారు. కేంద్రం నుంచి ఐదేళ్ళ కాలంలో పదిహేను వందల కోట్లు మాత్రమే సాయం అందింది. అంతేకాక, కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నారు, చేయలేదు. చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నాలుగేళ్ళ పాటు ఎన్‌డిఏ కూటమిలో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇద్దరు మంత్రులు మోడీ తొలి కేబినెట్‌లో ఉన్నారు. అయినా రాజధానికి నిధులను సాధించలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును విభజన చట్టం కింద కేంద్రం నిర్మించాల్సి ఉండగా, తాము నిర్మిస్తామని చంద్రబాబు తీసుకోవడంతో రాజధానికి కేంద్రం నుంచి నిధుల విషయం గట్టిగా అడగలేకపోయారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఐదేళ్ళ పాటు ఎటిఎంగా వాడుకున్నారంటూ మోడీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరోపించారు. చంద్రబాబు కేంద్రంలో ఎన్‌డిఏ నుంచి బయటకు రావడం వ్యూహాత్మక తప్పిదం. దానిని ఆసరాగా తీసుకుని కేంద్రం అమరావతికి మొండి చెయ్యి చూపిస్తోంది. జగన్‌ ‌నేతృత్వంలో వైసీపీ 22 ఎంపీ సీట్లను గెల్చుకున్నప్పటికీ, జగన్‌ ‌స్వయంగా వ్యాఖ్యానించినట్టు మోడీకి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం లేకపోవడంతో కేంద్రంతో గట్టిగా పోరాడేందుకు వైసీపీకి సరైన ఆయుధం లభించడం లేదు. సొంత బలం ఉండటం వల్ల మోడీ మొదటి విడత కన్నా, రెండో విడతలో ప్రాంతీయ పార్టీల పట్ల నిర్దయగా, వ్యవహరిస్తున్నారు. ఇందుకు మహారాష్ట్రలో శివసేన పట్ల బీజేపీ అనుసరిస్తున్న వైఖరి తాజా నిదర్శనం. శివసేన వల్లే మహారాష్ట్రలో బీజేపీ పుంజుకుంది. అయితే, తమ వల్లే శివసేన బలపడిందని కమలనాథులు పేర్కొంటున్నారు. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశాన్ని ఖాళీ చేయించే పని మీద ఉన్నారు. అయితే, చంద్రబాబు వ్యూహంలో భాగంగానే తెలుగు దేశం నాయకులు బీజేపీలోకి వెళ్తున్నారన్న వాదన సహేతుకంగానే ఉంది. కేసుల నుంచి రక్షణ కోసమే తన వారిని చంద్రబాబు బీజేపీలోకి పంపారన్న అభిప్రాయం కూడా సహేతుకంగానే ఉంది. చంద్రబాబు జగన్‌ ‌మీద వేసిన అస్త్రాలన్నీ తిరిగి ఆయనకే వచ్చి తగులుతున్నాయి. ఇసుక కొరత, ఆంగ్ల మాధ్యమం, అంశాల్లో చంద్రబాబు పోరాటాలు, ఆయనకు అత్యంత ఆంతరంగికునిగా వ్యవహరిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ ‌కల్యాణ్‌ ఆం‌దోళనలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు రాజధాని అంశాన్ని అడ్డు పెట్టుకుని జగన్‌ను బద్నామ్‌ ‌చేయాలని చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇస్తున్న మీడియా ప్రయత్నిస్తున్న సంగతి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గ్రహించారు. మంత్రి బొత్స నోటివెంట వచ్చే ప్రతి మాటా జగన్‌ ‌పలికిస్తున్నవేనని చంద్రబాబు, పవన్‌ ‌కల్యాణ్‌ ‌ప్రచారం చేస్తున్నారు. బొత్సతో పాటు కొడాలి నాని వంటి మంత్రుల ప్రకటనలు జగన్‌కు చేటు తెచ్చేవిగా ఉన్నాయి. వారిని అదుపు చేయకపోతే జగన్‌ ‌నష్టపోతారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసింది పబ్లిసిటీ, గ్రాఫిక్స్ ‌తప్ప ఏమీ లేదన్న సంగతి అందరికీ తెలుసు. ఆ విషయాన్ని అదే భాషలో చెప్పాలి కానీ, స్మశానాల ప్రస్తావన తీసుకుని రావడం వల్ల అధికార పార్టీపై ఇప్పటికే మరక పడింది. రాజధానిలో ఇన్‌ ‌సైడర్‌ ‌ట్రేడింగ్‌ ‌పేరిట అస్మదీయులకు చంద్రబాబు వందలాది ఎకరాలను సంతర్పణ చేసిన మాట నిజమే, ఇన్‌సైడర్‌ ‌ట్రేడింగ్‌ అం‌శాన్ని ఫోకస్‌ ‌చేయడానికి బదులు స్మశానాల గురించి ప్రస్తావన చేయడం అసంగతం. అలాగే, బొత్స వంటి వారు జగన్‌ ‌కన్నా పెద్ద వారు కావడం వల్ల అలాంటి వారిని ఆయన అదుపు చేయలేకపోతున్నారేమోననిపిస్తోంది. రాజధానికి చంద్రబాబు ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలూ రాని మాట నిజమే. ఇక మీదట ఆ విషయమై జగన్‌ ‌ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. ఎన్నికల వాగ్దానాల అమలు పేరిట ఖజానాపై అదనపు భారాన్ని మోపడాన్ని కొంత కాలం కట్టి పెట్టి ఆదాయాన్ని పెంచే మార్గాలపై జగన్‌ ‌దృష్టి సాధించాలి. ప్రస్తుత పరిస్థితిలో కేంద్రం నుంచి సాయం అందుతుందనుకుంటే భ్రమే. సొంత ఆదాయ వనరులపై జగన్‌ ‌దృష్టిని కేంద్రీకరించాలి.
– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్