వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఏసీబీకి పట్టుబడ్డ మునిసిపల్‌ ‌కమిషనర్‌, ‌జూనియర్‌ అసిస్టెంట్‌

December 2, 2019

నర్సంపేలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ
మునిసిపల్‌ ‌కమిషనర్‌, ‌జూనియర్‌ అసిస్టెంట్‌
అవినీతిని వీడెటట్లు కనిపించడంలేదు నర్సంపేట మునిసిపాలిటీ… కొన్ని నెలల క్రితమే బిల్‌ ‌కలెక్టర్‌ ఏసీబీకి పట్టు బడ్డాడు. ఇప్పుడేమో ఏకంగా మునిసిపల్‌ ‌కమిషనరే అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కాడు. ఇల్లు ఏజ్‌ ‌సర్టిఫికేట్‌ ‌కోసం వెళితే ఖర్చవుతుందని కష్టాలను తెచ్చుకున్నాడు. బాదితుడి పిర్యాదు మేరకు నిఘా పెట్టి రెడ్‌ ‌హ్యాండెడ్‌గా ఏసీబీ పట్టుకుంది. ఏసీబీ డీఎస్పీ మదుసూదన్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. నర్సంపేట పట్టణానికి చెందిన కొక్కు అశోక్‌ ‌తన ఇంటి లోన్‌ అప్లై చేసుకోవడానికి ఇంటి ఏజ్‌ ‌సర్టిఫికేట్‌ ‌కోసం మునిసిపల్‌ ‌కార్యాలయానికి గత నెల వెళ్లినట్లు తెలిపారు. దీంతో మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌వెంకటేశ్వర్‌రావు సర్టిఫికేట్‌కు 10వేలు ఖర్చు అవుతుందన్నారని చెప్పారు. అశోక్‌ అం‌త ఇచ్చుకోలేనని చెప్పడంతో 5వేలు ఇమ్మని చెప్పినట్లు తెలిపారు. దీంతో బాదితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు డీఎస్పీ తెలిపారు. ఏసీబీ వ్యూహంలో బాగంగా 5వేల లంచం కమిషనర్‌కు ఇవ్వబోగా జూనియర్‌ అసిస్టెంట్‌ ‌కిరణ్‌కు ఇవ్వమని చెప్పినట్లు వారు తెలిపారు. దీంతో కిరణ్‌ ‌డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ ‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ మదుసూదన్‌రెడ్డి విలేకరులకు తెలిపారు. మునిసిపల్‌ ‌కమీషనర్‌ ‌వెంకటేశ్వర్‌రావు, జూనియర్‌ అసిస్టెంట్‌ ‌కిరణ్‌లపై కేసు నమోదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ ఎస్సైలు క్రాంతి, సతీష్‌, ‌రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.