వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఐనాపూర్‌లో దారుణం ఆస్తికోసం అన్న కుటుంబంపైనే కుట్ర?

September 5, 2019

  • బర్త్‌డే కేక్‌లో విషం కలిపి ఘాతుకం
  • తండ్రీకొడుకు మృతి

సిద్ధిపేట జిల్లా కొమురవెళ్లి మండలంలోని ఐనాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. బర్త్‌డే కేకులో విషం కలిపి ఇవ్వడంతో తండ్రీకొడుకు ఇద్దరు మృతిచెందారు. వివరాల్లోకి వెళ్లితే…ఐనాపూర్‌కు చెందిన రమేష్‌(39)  ‌భార్య భాగ్యలక్ష్మి(35), కూతురు పూజిత(12), కుమారుడు రామ్‌చరణ్‌(9)‌తో కలిసి నివాసముంటున్నాడు. బుధవారం రాత్రి రామ్‌చరణ్‌ ‌పుట్టినరోజు కావడంతో కుటుంబమంగా ఆనందంగా గడిపింది.రామ్‌చరణ్‌ ‌బర్త్‌డే కేక్‌ ‌కట్‌ ‌చేసి కుటుంబసభ్యులకు తినిపించి తానూ తిన్నాడు. కాసేపటికే వారంతా వాంతులు చేసుకోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. రమేష్‌, ‌రామ్‌చరణ్‌ ‌చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా… తల్లీకూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ కుటుంబంలో తీరనిశోకం మిగిలింది.  కేక్‌లో విషం కలవడం వల్లే వారు చనిపోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ కేక్‌ను రమేశ్‌ ‌తమ్ముడు శ్రీనివాస్‌ ‌పంపించినట్లు తెలుస్తోంది. అన్నదమ్ములిద్దరికీ భూతగాదాలు నడుస్తున్నాయని, అన్న కుటుంబాన్ని అంతమొందించేందుకు శ్రీనివాస్‌ ‌కేక్‌లో విషయం కలిపి పంపించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఆస్తి కోసం సొంత అన్న కుటుంబాన్నే నాశనం చేసేందుకు పన్నాగం పన్నిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.