వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఒక్కరోజులో సమస్య పరిష్కరించొచ్చు

May 10, 2019

విద్యార్థులు మరణిస్తున్నా కేసీఆర్‌కు పట్టదా?
గ్లోబరీనాను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నం
కేసీఆర్‌ ‌షికార్లు చేస్తున్నారు – విద్యాశాఖ మంత్రిని, బోర్డు కార్యదర్శిని తొలగించాలి
ఎన్నికల ఫలితాల తర్వాత మహా కూటమిదే కీలక పాత్ర : టీజేఎస్‌ అధ్యక్షుడు, ప్రొ।। కోదండరామ్‌
‌విద్యార్థి సంఘాల నిరాహారదీక్షకు నాయకుల సంఘీభావంరాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ‌ఫలితాల్లో అవకతవకల వ్యవహారాన్ని ప్రభుత్వం తలచుకుంటే ఒక్కరోజులో పరిష్కారం అవుతుందని, విద్యార్థులకు న్యాయం జరుగుతుందని తెరాజ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఇంటర్‌ ‌ఫలితాల తీరుపై ముగ్ధూం భవన్‌లో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో రెండో రోజు శుక్రవారం కొనసాగుతున్న నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఆయనతో పాటు పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, తెదేపా, తెజస, సీపీఐ నేతలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఒక్క మాటకూడా మాట్లాడకుండా విద్యార్థుల చావులకు కారణమవుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇంత గందరగోళం నెలకొంటే ఫ్రంట్‌ ‌పేరుతో కేసీఆర్‌ ‌తీర్థయాత్రలు చేస్తున్నారని కోదండరాం విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రిని, ఇంటర్‌ ‌బోర్డు కార్యదర్శిని తొలగించాలని డిమాండ్‌ ‌చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం ఉలుకూపలుకూ లేకుండా వ్యవహరిస్తోందన్నారు. కనీసం అధికారులు కూడా ఒక్క సమాధానం చెప్పని పరిస్థితిని, సంబంధిత వ్యక్తులపై చర్యలకు పూనుకోని వైనాన్ని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. గ్లోబరీనా అనే ఒక్క సంస్థను వెనకేసుకు రావడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా కృషిచేయడం ఎన్నడూ చూడబోమన్నారు. గ్లోబరీనాను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదన్నారు. ఈ వ్యవహారంలో ఇంటర్‌ ‌బోర్డు ఇంకా బోనులోనే ఉందన్నారు. రాష్ట్రంలో పాలన పడకేసిందని కోదండరాం ఆరోపించారు. ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ అనేది అత్యాశ.. అది అయ్యే పని కాదన్నారు. రాష్ట్రం నుంచి బయటకు వెళ్లటానికి కేసీఆర్‌ ఆడుతోన్న నాటకంగా అభివర్ణించారు. ఫ్రంట్‌ ‌పేరుతో కేసీఆర్‌ ‌సమయం వృధా చేయకుండా కీలక సమస్యలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. పదో తరగతి ఫలితాలు వెంటనే విడుదల చేయాలన్నారు. ఎండల వేడి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవుపలికారు. రెవెన్యూ శాఖలో సమస్యలున్న మాట వాస్తవమన్నారు. సంస్కరణలపై ప్రభుత్వం అన్ని పక్షాలతో మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ లేకుండా రెండు సార్లు మాత్రమే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. నేషనల్‌ ‌ఫ్రంట్‌కు బయట నుంచి బీజేపీ మద్దతు ఇచ్చిందని.. యునైటెడ్‌ ‌ఫ్రంట్‌కు కాంగ్రెస్‌ ‌బయట నుంచి మద్దతు ఇచ్చిందని వివరించారు. దేశంలో అన్ని పార్టీలు మహా కూటమిగా ఏర్పడ్డాయని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాత మహా కూటమే కీలక పాత్ర పోషించబోతోందన్నారు. కేసీఆర్‌, ‌జగన్‌ ‌మాత్రమే మిగులుతారని తేల్చిచెప్పారు.