వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కేసీఆర్‌ ఎంఐఎం‌కు భయపడుతున్నాడు

September 14, 2019

విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంలేదు
17న ఊరూరా జాతీయ జెండా.. తిరంగా యాత్ర నిర్వహిస్తాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా।। లక్ష్మణ్‌
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంఐఎంకు భయపడే విమోచన దినో త్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ శనివారం గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం లక్ష్మణ్‌ ‌విలేకరులతో మాట్లాడుతూ.. కల్వకుంట్ల చరిత్ర వెలుగులోకి రావాలనే ఉద్యమకారుల చరిత్రను తొక్కిపెడుతున్నారని అన్నారు. సెప్టెంబర్‌ 17‌న ఊరు నిండా జాతీయ జెండా.. తిరంగా యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. పటాన్‌ ‌చెరువులో బహిరంగసభ నిర్వహిస్తామని వెల్లడించారు. కల్వకుంట్ల కుటుంబం తీరుకు వ్యతిరేకంగా సమర శంఖం పూరిస్తున్నామని చెప్పారు. ప్రజలంతా తమతో కలిసి రావాలని కోరారు. 20 ఏళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. విపక్షంలో ఉన్నపుడు విమోచన దినోత్సవాన్ని జరుపుతామంటూ అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ‌మాటల తీరుతో ఊసరవెల్లి సైతం తలదించుకుంటుందని విమర్శించారు. మాటమార్చిన కేసీఆర్‌.. ‌తెలంగాణ ఉద్యమ కారులను విస్మరిస్తున్నారని, వారి చరిత్రను తొక్కిపెడుతున్నారని అన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో లక్ష్మణ్‌తో పాటు డీకే అరుణ, జితేందర్‌ ‌రెడ్డి, ఆకుల విజయ, ఇంద్రసేనా రెడ్డి, పెద్దిరెడ్డి, వివేక్‌లు ఉన్నారు.