వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

కొనసాగుతున్న సహాయక చర్యలు

September 17, 2019

మూడోరోజు 18మృతదేహాలు లభ్యం
315అడుగుల లోతులో బోటు
ఇంకా 21 మందికోసం గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు

ఫోటో: గోదావరిలో బోటు మునిగిన ప్రదేశంలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

మూడు రోజుల క్రితం గోదావరిలో గల్లంతైన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 18మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మొత్తంగా 26 మృతదేహాలు బయటపడ్డాయి. ఇంకా గల్లంతైన 21 మందికోసం గాలింపు చర్యలను ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌బృందాలు ముమ్మరంగా గలిస్తున్నాయి. మూడో రోజు వివిధ ప్రదేశాల్లో ఒక్కొక్కటిగా కొట్టుకొస్తున్నాయి. బోటు మునిగిన ప్రాంతంలోనే ఎక్కువగా తేలుతున్నాయి. కేవలం దేవీపట్నం వద్దే 12 మంది మృతులను గుర్తించారు.మరోవైపు మంగళవారం ఉదయం ధవళేశ్వరం బ్యారీ వద్దకు ఇద్దరి మృతదేహాలు కొట్టుకు వచ్చాయి. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం కొత్త పట్టిసీమ వద్ద మరొక మృతదేహం లభ్యమైంది. మృతుడి జేబులో ఉన్నగుర్తింపు కార్డును పరిశీలించిన పోలీసులు, అతడిని హైదరాబాద్‌లోని మాదాపూర్‌ ‌వాసి ఇ. సాయికుమార్‌గా గుర్తించారు. పోలవరం ఇసుక రేవు వద్ద ఒక మృతదేహం బయటపడగా.. కచ్చులూరు, ఎగువ కాఫర్‌ ‌డ్యామ్‌ ‌వద్ద ఒక్కో మృతదేహాన్ని గుర్తించారు. తాళ్లపూడి వద్ద ఒకటి, ధవళేశ్వరం వద్ద మరో మృతదేహం లభ్యమైంది. 17వ నెంబరు గేటు వద్ద లభ్యమైన మృతదేహాన్ని బోటు ప్రమాద మృతుడిగా అధికారులు భావిస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇదిలాఉంటే ప్రమాదానికి గురైన బోటు 315 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. బోటు మునిగిన ప్రదేశంలో సుడిగుండాలు ఎక్కువగా ఉన్నందున సహాయక చర్యలకు తీవ్ర ప్రతికూలంగా మారిందని అధికారులు చెబుతున్నారు. సుడిగుండాలు, వరద ఉద్ధృతితో సహాయక బోట్లు నిలవలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పటికి 21మంది ఆచూకీ లభించలేదు. గల్లంతైన వారికోసం విస్త్ర•తంగా గాలింపు చేపడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ అధికారులతో సహా బ్యారేజీ వద్దకు చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేస్తుందని హా ఇచ్చారు.