వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ ‌భేటీ

November 25, 2019

ఫోటో: గవర్నర్‌ ‌తమిళసైకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం కేసీఆర్‌
ఫోటో: గవర్నర్‌ ‌తమిళసైకి పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం కేసీఆర్‌

ఆర్టీసీ ప్రైవేటీకరణ, కొత్త రెవెన్యూ చట్టం, అసెంబ్లీ సమావేశాలపై చర్చ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌సోమవారం రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళసైతో సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో అనేక అంశాలపైన ముఖ్యమంత్రి గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం.చాలా రోజుల తరువాత ఈ సమావేశం జరిగినందున ఈ సమావేశానికి పరిపాలనా పరంగా, రజకీయంగా విస్తత ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధానంగా, ఆర్టీసీలో రూట్ల ప్రైవేటీకరణ, కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తదితర అంశాలను వీరు చర్చించినట్లు సమాచారం. 52 రోజులుగా దాదాపు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై, గవర్నర్‌కు సీఎం వివరించినట్లు తెలిసింది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై చేసిన మంత్రివర్గ తీర్మానం, దానికి సంబంధించిన జీవో తదితర అంశాలను అందించి వాటి నేపథ్యాన్ని ముఖ్యమంత్రి వివరించారు. కాగా, కొత్త రెవెన్యూ చట్టం తీసుకుని రావాల్సిన ఆవశ్యకతను, ముసాయిదాలో పొందుపరచిన నిబంధనలను గవర్నర్‌తో సీఎం చర్చించారు. రెవెన్యూ శాఖపైన రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి వసున్న ఫిర్యాదులు, చట్టపరంగా వస్తున్న సమస్యలు వాటిని పరిష్కరించాల్సిన సందర్భం వివరించారు. రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకు రావడం ద్వారా మాత్రమే రైతాంగ సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వ అభిప్రాయంగా తెలిపారు. ఆర్టీసీ సంస్థకు వస్తున్న నష్టాలను, పేరుకుపోయిన నష్టాలను వివరించి ప్రైవేటీకరించాల్సిన ఆవశ్యకతను విన్నవించినట్లు తెలిసింది. ఆర్టీసీని ప్రైవేటీకరించినట్లయితే, రాష్ట్ర ప్రజలకు విస్తత రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించినట్లు తెలిసింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించి కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదముద్ర తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ కారణంతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశాన్ని శాసనసభలో తీసుకోనున్న చట్టాలను, వాటిలో తీసుకురానున్న మార్పులను వాటి ప్రాధాన్యతలను గవర్నర్‌కు నివేదించినట్లు తెలిసింది.గవర్నర్‌తో సీఎం తొలి సమావేశంరాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్‌ ‌కేసీర్‌తో భేటీ అయ్యారు. గవర్నర్‌ ‌ప్రమాణ స్వీకారోత్సవం, ఆమెను రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించడం వంటి అధికారిక కార్యక్రమాలలో గతంలో సమావేశమైనప్పటికీ రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సోమవారం జరిగిన భేటీ తొలి సమావేశం. ఈ సమావేశంలోనే పరిపాలనా పరంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం గవర్నర్‌కు వివరించారు.పరిపాలనా అంశాలతో పాటు రాజకీయ విషయాలను వీరు మాట్లాడుకున్నట్లు తెలిసింది.