వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

గాంధీ మార్గమై..!

October 1, 2019

దేశ విముక్తి కి తపన
సాగెను యుక్తి పథాన
అహింస ఆయుధమై
హింసకు ప్రతి హింస
అహింసే అని నేర్పిన
మహిమాన్విత వ్యక్తి
పిరికి వారిని ఉరికే వారిగ
మార్చిన మాటల శక్తి
కరుణామృత మూర్తి
నాటి తరం మహాత్మునిగా కీర్తి
నేటి తరానికి స్వీకృతి
రేపటి తరం ఆలోచనల ఆకృతి
సత్యం అహింసల అభిలాషి
మనలో ఉండాలి
మననంలో ఉండాలి
తరతరానికి ఇంకా ఉండాలి
కదిలే ప్రవాహమై!
యెదలో స్పూర్తిని నింపాలి
గాంధీ మార్గమై!!

నిఖార్సయిన నేత..
లాల్‌ ‌బహదూర్‌
‌లాల్‌ ‌బహద్దూర్‌.. ‌శాస్త్రి
నాడు జనం మెచ్చిన జోత
నేడు మనం మరచిన పాత
దేశ భక్తిలో నిబద్దత
నిస్వార్ధతలో దార్శనికత
త్యాగ నిరతికి నిలువు పోత
నిఖార్సయిన రాజకీయ నేత
దేశానికి అయ్యినా ప్రదాని
సొంత గూడు కనని వదాని
దేశానికి అన్నం పెట్టే రైతన్న
ప్రాణాల ఫణం పెట్టిన సైనికుల
జై జవాన్‌.. ‌జై కిసాన్‌.. అని నినదించి
ప్రణాళికలు రూపొందించిన విజ్ఞాని
దాయాదితో జరిపిన యుద్ధంలో..
సైన్యంలో స్ఫూర్తి రగిలించిన ధమని
మహాత్ముని యాదిలో మరచిన అవధాని
నేటి తరం స్మరించని పూర్వ ప్రదాని
మాన్యడవూ లాల్‌ ‌బహద్దూర్‌ ‌శాస్త్రీ..
మీ సేవలెన్నో దేశానికి చేస్తిరి
భారతావనికి మహనీయులైతిరి.!

– పాల్వంచ హరికిషన్‌
‌రామన్నపేట
9502451780