వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

September 28, 2019

వరంగల్‌ : ‌హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు  ఫొటో : బెలిదె శ్రీనివాస్
వరంగల్‌ : ‌హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు ఫొటో : బెలిదె శ్రీనివాస్

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమైన తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవాలు వరంగల్‌లోని హన్మకొండ వేయిస్తంభాల దేవాలయంలో శనివారం ఎంగిళిపూల బతుకమ్మ పండుగను సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ‌జ్యోతి ప్రజ్వళన చేసి అధికారికంగా ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోని పల్లె పల్లెలో ఎంగిళిపూల బతుకమ్మను ఆడపడుచులు అత్యంత భక్తిశ్రద్ధలతో , కోలాటాలతో బతుకమ్మ.. బతుకమ్మ… ఉయ్యాలో అంటూ ఆనందోత్సహాలతో బతుకమ్మను స్వాగతించారు. బతుకమ్మ పండుగ అంటేనే చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు తెల్లవారుజాముననే తలాంటు స్నానాలు చేసి తంగేడు పూలు, కట్ల పూలు, చామంతి, బంతి, గన్నేరు రకరకాల పూలను సేకరించి అందంగా బతుకమ్మలను పేర్చి పైన తమలపాకులో గౌరమ్మను పెట్టి పూజించారు. అందంగా పేర్చిన బతుకమ్మలను గుడి ఆవరణలోకి ఆడపడుచులంతా చేత పట్టుకొని వచ్చి అక్కడ ఉత్సహాంగా బతుకమ్మ పాటలు పాడారు. అనంతరం ఒకరినొరకు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.