ఎంపిలు భావోద్వేగాలతో చట్టాలకు అంగీకరించరాదు
చర్చలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్
రాజ్యాంగ వ్యవస్థను పర్యవేక్షించడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన స్టేట్మెంట్లో పేర్కొన్నారని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రాజ్యసభ 250వ సెషన్ సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, తొందరపడి ఎటువంటి చట్టాలను ఆమోదించకుండా చూసుకునే బాధ్యత ఎంపీలపై ఉందని మాజీ ప్రధాని అన్నారు. భావోద్వేగంగా కూడా ఎటువంటి చట్టాలను చేయరాదన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై చర్చలు చేపట్టేందుకు రాజ్యసభ కొంత సమయం కేటా యించాలని సూచి ంచారు. రాజ్యసభ పర్మనెంట్ హౌజ్ అని, ప్రతి జనరల్ ఎలక్షన్ తర్వాత దీన్ని మళ్లీ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. చట్టాల రూపకల్పనలో రాజ్యసభ పటిష్టంగా పనిచేస్తోందన్నారు. అనేక చట్టాలకు సవరణలు, కొత్త విషయాలను చేర్చడంలో రాజ్యసభ దోహద పడిందన్నారు. ప్రజలకు రాజ్యసభ ఉపయోగకరంగా ఉంటుందని తొలి చైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారని గుర్తుచేశారు. రాజ్యసభ నుం పార్లమెంట్‌కి ఎంపికైన మన్మోహన్ సింగ్ తన అనుభవాలని గుర్తు చేస్తుకున్నారు. ప్రతిపక్షనేతగా, ప్రధానిగా అనేక అంశాలపై రాజ్యసభలో ప్రసగించినట్లు ఆయన తెలిపారు. దేశానికి దిశానిర్ధేశర చేయడంలో రాజ్యసభ కీలక పాత్ర పోషించిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు.