వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

చల్లని కబురు!

May 9, 2019

జూన్‌ ‌రెండోవారంలోనే రాష్ట్రానికి రుతు పవనాలు
– పీఐకే సంస్థ వెల్లడితెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. పలు ప్రాంతాల్లో 46డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి నమోదవుతున్నాయి.. దీంతో ప్రజలు మధ్యాహ్నం సమయంలో రోడ్లపైకి రావా లంటేనే జంకుతున్నారు. విపరీతమైన వేడిగాలులతో చెట్ల కింద సేదతీరే పరిస్థితి కూడా లేకుండా పోయింది.. ఎండలు తీవ్రత ఎప్పుడు తగ్గుతుందా అని ప్రజలు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.. ఎండలతో మండి పోతున్న తెలంగాణ వాసులకు పీఐకే చల్లని కబురు తెచ్చింది. 2019లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు జూన్‌ ‌రెండో వారంలోనే తెలంగాణను తాకను న్నాయని ఇండో-జర్మన్‌ ‌ప్రాజెక్టులో భాగమైన పాట్స్ ‌డామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌క్లైమేట్‌ ఇం‌పాక్ట్ ‌రిసెర్చ్ (‌పీఐకే) సంస్థ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 8 ‌నుంచి 16వ తేదీ మధ్య నైరుతి రుతు పవనాలు మొదలయ్యే అవకాశముందని పీఐకే ప్రొఫెసర్‌ ఎలెనా సురోవ్యతినా తెలిపారు. తూర్పు కనుమలు, తూర్పు దక్షిణ ప్రాంతం, ఛత్తీస్‌గఢ్‌లోని పశ్చిమప్రాంతం, ఉత్తర తెలంగాణ కేంద్రంగా నిర్వహించిన అధ్య యనంలో ఈ విషయం వెల్లడైందని పీఐకే తెలిపింది. టిప్పింగ్‌ ఎలిమెంట్‌ ‌విధానంతో 2016 నుంచి వినూత్న తరహాలో నిర్వహిస్తున్న వాతావరణ పరిశోధనలు వాస్తవ మయ్యాయని పీఐకే తెలిపింది.