వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఛత్తీస్‌ఘఢ్‌, ఒడిషా రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్‌

May 8, 2019

ఏడుగురు మావోయిస్టులు మృతి, ఆయుధాలు స్వాధీనంసరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలో బుధవారం మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌ఘఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ, సుకుమార్‌ ‌జిల్లాల సరిహద్దుగా ఎస్‌టిఎఫ్‌ ‌బలగాలు కూంబింగ్‌ ‌నిర్వహిస్తుండగా గమనించిన మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకు దిగగ వెంటనే పోలీసు బలగాలు కూడ ఎదురుకాల్పలు జరిపారు. ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. వారివద్ద నుండి ఒక రైఫిల్‌, 12 ‌బోర్‌ ‌తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలం నుండి కొంత విప్లవ సాహిత్యాన్ని కూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఒడిషాలో భారీ ఎన్‌కౌంటర్‌ ఐదుగురు మావోయిస్టులు మృతి.
ఒడిషా రాష్ట్రంలోని కోరాఫూట్‌ ‌జిల్లా టిటుకాంటి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని నందకూర్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ ‌నిర్వహిస్తుండగా మావోయిస్టులు పోలీసులను గమనించి కాల్పులు జరుపగా ఇరువురి మధ్య కొంతసేపు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఘటనా స్థలం వద్ద ఒక డంప్‌ను కూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాల్పుల అనంతరం పోలీసులు అటవీ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంకేమైనా మృతదేహాలు ఉన్నాయేమోనని పరిశీలన చేసారు. ఇటీవలే మావోయిస్టులు ఆ ప్రాంతంలో పోలీసులపై దాడి చేసి 16 మంది పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. అప్పటి నుండి పోలీసు బలగాలు ఆ ప్రాంతంలో మావోయిస్టులను ఏరివేసేందుకు పక్కా వ్యూహం పన్ని ఐదుగురు మావోయిస్టులను హతమార్చారు. మృతి చెందిన మావోయిస్టులను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేసారు.