వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జడ్జీల పదోన్నతులపై కేంద్రానికి ‘సుప్రీమ్‌’ ‌షాక్‌

May 9, 2019

‌న్యాయమూర్తుల పదోన్నతులకు సీనియార్టీకంటే యోగ్యతే ప్రధానంన్యాయమూర్తుల పదోన్నతుల విషయంలో కేందప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య మరోసారి విభేదాలు నెలకొన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం నిమిత్తం ఝార్ఖండ్‌ ‌హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ అనిరుద్దా బోస్‌, ‌గువాహటి హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌ ఎ.ఎస్‌.‌బోపన్నల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం ఏప్రిల్‌ 12‌న సిఫారసు చేసింది. అయితే వీరి పదోన్నతికి కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అభ్యంతరాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. పదోన్నతికి సీనియారిటీతో పాటు యోగ్యత అనేది ప్రధానమని ఐదుగురు సీనియర్‌ ‌న్యాయమూర్తులతో కూడిన కొలీజియం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జడ్జీలుగా జస్టిస్‌ అనిరుద్దా బోస్‌, ‌జస్టిస్‌ ‌బోపన్నల పేర్లను కొలీజియం మరోసారి ప్రతిపాదించింది. సీనియారిటీ, ప్రాంతీయ ప్రాతినిధ్యాల కారణంగా జస్టిస్‌ అనిరుద్ధా బోస్‌, ‌జస్టిస్‌ ‌బోపన్నల పేర్లను కేంద్ర ప్రభుత్వం మంగళవారం తిరిగి కొలీజియంకు తిప్పి పంపింది. దీనిపై గురువారం సమావేశమైన కొలీజియం.. సీనియారిటీ కంటే కూడా యోగ్యతకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించింది. వీరిద్దరి పేర్లను మరోసారి ప్రతిపాదించింది. వీరితో పాటు జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయ్‌, ‌జస్టిస్‌ ‌సూర్య కాంత్‌ ‌పేర్లను కూడా ప్రతిపాదించింది. జస్టిస్‌ ‌గవాయ్‌ ‌ప్రస్తుతం బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్‌ ‌కాంత్‌ ‌హిమాచల్‌‌ప్రదేశ్‌ ‌హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం 27 మంది మాత్రమే ఉన్నారు.