తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ కౌశిక్ ఫిర్యాదు
రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ ఇంట్లో సోదాలు చేసిన పోలీసులుటీవీ9 సీఈవో రవిప్రకాష్ ఇంటితో పాటు.. టీవీ9 కార్యాలయంలో గురువారం సైబర్ క్రై పోలీసులు సోదాలు నిర్వహించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద డియా సెక్రటరీ కౌశిక్ రావు రవిప్రకాష్‌పై ఫిర్యాదు చేశారు. దీంతోపాటు సంస్థకు చెందిన నిధులను కూడా దారిమళ్లించారని రవిప్రకాష్‌పై ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు… టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాష్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల సమయంలో రవిప్రకాష్ ఇటు టీవీ9 కార్యాలయంలోనూ.. తన నివాసంలోనూ అందుబాటులో లేరని తెలిసింది. మరోవైపు సోదాల సమయంలో టీవీ 9 కార్యాలయంలో కొన్ని ఫైళ్లు, ల్యాప్ ట్యాప్, హార్డ్ డిస్క్‌లు మాయం
అయినట్టు పోలీసులు గుర్తించారు. టీవీ9 సీఈవో రవిప్రకాష్‌తో పాటు హీరో శివాజీపై అలందా డియా సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 406, 420, 467, 469, 471, 120 బీ, తిబి యాక్ట్ 66, 72 కింద కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రై పోలీసులు. టీవీ9ను కొనుగోలు చేసిన అలందా డియాకు అప్పగించినట్లు ఒప్పందం జరిగినా డైరెక్టర్ల నియామకానికి అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. టీవీ9లో 91 శాతం అలందా డియాకు వాటా ఉండగా.. రవిప్రకాష్‌కు 8.5 శాతం వాటా ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పందం సమయంలో ఇచ్చిన డాక్యుమెంట్లు ఫోర్జరీ పత్రాలని గుర్తించిన అలందా డియా… పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తనకు 40వేల షేర్లు టీవీ9లో ఉన్నాయని, తనకు తెలియకుండా అలందాకు విక్రయించారని శివాజీ ఆరోపించారు. అయితే, రవి ప్రకాష్, శివాజీ ఇద్దరు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి మమ్మల్ని మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదులో అలందా డైరెక్టర్ కౌశిక్ రావు పేర్కొన్నారు. ఇక టీవీ9 ఆఫీసు, సీఈవో రవి ప్రకాష్ నివాసంతో పాటు… హీరో శివాజీ నివాసంలోనూ పోలీసుల సోదాలు చేశారు.
సీఈవోగా రవిప్రకాశ్ తొలగింపు?
నిధుల మళ్లింపు, ఫోర్జరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈవో రవిప్రకాశ్‌కు టీవీ9 ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఆయనను సీఈవో బాధ్యతల నుంచి యాజమాన్యం తప్పించిందని, సంస్థ నిర్వహణలో వైఫల్యంతో పాటు, సంస్థలో కీలక ఉద్యోగి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఆరోపణల నేపథ్యంలో యాజమాన్యం గురువారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎబీసీఎల్) వ్యవస్థాపకుడు, సీఈవో రవిప్రకాశ్‌కు కేవలం ఎనిమిది శాతం వాటా మాత్రమే ఉన్నప్పటికీ నూతన యాజమాన్యానికి సహకరించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. తన నిర్ణయాలే చెల్లుబాటు అయ్యేలా ఒత్తిడి తేవడంతో పాటు, టీవీ9 తన ఆధ్వర్యంలోనే నడవాలని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా టీవీ9లో మెజారిటీ వాటా కలిగిన శ్రీనిరాజు తన వాటాలను అలంద డియాకు విక్రయించిన విషయం విదితమే. దీంతో వివాదం తారాస్థాయికి చేరింది.