వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఢిల్లీతో సహా దేశమంతటా హై అలర్ట్

October 3, 2019

‌నిఘా వర్గాల సూచన మేరకు దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ‌ప్రకటించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొన్న సందర్భంలో ఉగ్రవాదులు భారీ దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశ రాజధాని ప్రధాన లక్ష్యంగా, వీలు కాకుంటే మరే ఇతర నగరాల్లో దాడులకు పాల్పడాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి ముందస్తుగానే ఆయుధాలను అక్రమంగా వివిధ మార్గాల్లో దేశంలోకి తరలించారని గుర్తించారు. జైషే ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని అలర్ట్ ‌ప్రకటించిన భద్రతా వ్యవస్థకు సంబంధించిన
ఉన్నతస్థాయి అధికారులు ఎలాంటి దాడులనైనా ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని పాతబస్తిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఇతర ప్రాంతాల్లో సైతం భద్రతను పటిష్టం చేయాలని దేశవ్యాప్తంగా ఆదేశాలు జారీచేశారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్థికల్‌ 370 ‌రద్దు నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేసాయి. ఇప్పటికే చాలా మంది ఉగ్రవాదులు పాకిస్తాన్‌ ‌బార్డర్‌ ‌నుంచి భారత్‌ ‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించగా అందులో చాలా వరకు ఉగ్రవాదులు ఎన్‌కౌంటర్‌లలో హతమయ్యారు. కానీ సరిహద్దుల్లో ఉన్న రవాణా, నిఘా లోపాలను అవకాశంగా తీసుకుని కొందరు స్లీపర్‌ ‌సెల్స్ ‌సహాయంతో దేశంలోని పలు నగరాలకు చొరబడినట్లు సమాచారం అందింది.