వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఢిల్లీని తాకిన ఆర్‌ ‌టీ సి సమ్మె సెగ

October 9, 2019

దేశరాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా తెలంగాణ భవన్‌ ‌ముందు ట్రేడ్‌ ‌యూనియన్‌ ‌నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ‌యూనియన్‌, ఏఐసీసీటీయూ నాయకులు పాల్గొన్నారు..ప్రభుత్వం బర్తరఫ్‌ ‌చేసిన ఆర్టీసీ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అరెస్టు చేసిన ఆర్టీసి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ ‌చేశారు. హాజరైన వివిధ నాయకులు , యూనియన్‌ ‌కార్యకర్తలు సీఎం కేసీఆర్‌ ‌కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.సీఎం కేసీఆర్‌ ‌తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసిని వాడుకొని ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక వారి డిమాండ్స్ ‌ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని…లేకుంటే టీఎస్‌ ఆర్టీసి కి మద్దతుగా దేశంలోని అన్ని ట్రెడ్‌ ‌యూనియన్లు ధ•ర్నాకు దిగుతామని హెచ్చరించారు.తెలంగాణ భవన్‌ ‌రెసిడెంట్‌ ‌కమిషనర్‌ ‌వేదాంత గిరికి వినతిపత్రము ఇచ్చిన ట్రేడ్‌ ‌యూనియన్‌ ‌నాయకులు త్వరలోనే సానుకూలంగా వ్యవహరించకుంటే తమ దేశవ్యాప్త సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.