వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ఢిల్లీ పర్యటనలో సిఎం కేసీఆర్‌

October 3, 2019

‌తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దాదాపు 9 నెలల సుదీర్ఘ కాలం తరువాత ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. ఇందుకై ఆయన గురువారం సాయంత్రం త్య్రేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రానికి చెందిన పలు పెండింగ్‌, ‌నూతన ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు ప్రధానికి నేరుగా నివేదించేలా సీఎం పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌తో భేటీ అయి చర్చించిన పలు అంశాలను వివరించి ఇరు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను నెరవేర్చే నదీజలాల అనుసంధానం
గురించి ప్రధానంగా పీఎం దృష్టికి తేవాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై కీలక నేత, ప్రణాళికాసంఘం విసి వినోద్‌తో బాటు పలువురు సీనియర్‌ అధికారులతో చర్చించాకే ఢిల్లీ పర్యటనను ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఇక ప్రధాని ఆఫీసు నుండి కూడా అనుమతి లభించడంతో ఈ పర్యటనలో ఇతర కేంద్ర మంత్రులను సైతం కలిసి తమ పథకాలకు అవసరమైన నిధులు కోరాలని నిర్ణయించారని తెలుస్తోంది.