వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు

November 28, 2019

న్యూఢిల్లీ : గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. అంతర్జాతీయ పరిణామాలకు తోడు వివిధ కారణాల మూలంగా వారం రోజులపాటు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మల్టీ కమిడిటీ ఎక్స్ఛేంజ్‌(ఎం‌సిఎక్స్)‌లో బంగారం ఫ్యూచర్స్ 10 ‌గ్రాములకు 0.20 శాతం పెరిగి 37,647 కు చేరింది. దీంతో సెప్టెంబర్‌లోని రికార్డ్ ‌ధర రూ. 40,000గా ఉన్న ధర 2,300కు పైగా తగ్గింది. ఎంసిఎక్స్‌లో వెండి ధర కూడా కిలో 0.40 శాతం తగ్గి రూ. 44,262కు చేరింది. మరో పక్క అమెరికా-చైనా ట్రేడ్‌ ‌డీల్‌ ‌సానుకూలత తోడైన కారణంగా బంగారం ధరలు ఔన్సుకు అంతర్జాతీయంగా 0.1 శాతం తగ్గి 1,459.91గా స్థిరపడి రెండు వారాల కనిష్టానికి తాకింది. భారత మార్కెట్లో పసిడి ధర రికార్డు స్థాయిలో దాదాపు 20శాతం వరకు పెరుగుదలను నమోదు చేసుకుంది. కాగా సెప్టెంబర్‌ ‌నెల ఆరంభం నాటికి బంగారం ధర ఎంసిఎక్స్ ‌మార్కెట్లో 10 గ్రాములకు గరిష్ఠంగా రూ. 40,000ల మార్క్‌ను దాటింది. వెండి ధర కూడా కిలోకు రూ. 50 వేల మార్క్‌ను దాటింది. ఆ తర్వాత నుంచి కాస్త తగ్గు ముఖం పట్టింది.