వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

తల్లిదండ్రుల్లో మార్పులు రావాలి

December 3, 2019

ఫోటో:మంగళవారం సిద్దిపేటలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో మాట్లాడుతున్న హరీష్‌ ‌రావు
ఫోటో:మంగళవారం సిద్దిపేటలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో మాట్లాడుతున్న హరీష్‌ ‌రావు

మగ పిల్లలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి
సంస్కారంతో కూడిన విద్యను అందించాలి
‘దిశ’పై అఘాయిత్యం బాధాకరం : మంత్రి హరీష్‌ ‌రావు

జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో సత్య సాయి ట్రస్ట్ ‌వారి సహకారంతో టిఫిన్‌ – ‌ట్యూషన్‌ , ‌వొడా ఫోన్‌ ‌వారి సౌజన్యంతో విద్యార్థులకు ఎనిమియా పరీక్షల కార్యక్రమంను ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఆరో తరగతి నుంచి పదో తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ సాయంత్రం టిఫిన్‌ – ‌ట్యూషన్‌ ‌కార్యక్రమంను ఏర్పాటు చేశామని తెలిపారు.పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట రాష్ట్రంలో నెంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో ఉండాలనీ,దిశా పై జరిగిన అఘాయిత్యం చాలా బాధ కలిగించిందని అన్నారు. తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి. మగ పిల్లలకు సంస్కారంతో కూడిన విద్య అందించాలన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలపై కన్నా మగ పిల్లలపై ఎక్కువ దృష్టి పెట్టాలనీ,మగ పిల్లలు ఏం చేస్తున్నారన్న విషయంపై నిరంతరం పర్యవేక్షిం చాలన్నారు.
సిద్దిపేట ప్రభుత్వ పాఠశాలల్లో రెండు కొత్త కార్యక్రమాలు … 30 లక్షల రూపాయలతో 413 స్కూల్స్ 68 ‌వేల మంది విద్యార్థులకు అనీమియా టెస్ట్ 11 ‌మిషన్లు వొడాఫోన్‌ ‌వాళ్ళు 6 నుండి 12 వ తరగతి వాళ్ళు అనీమియా ఉన్న వాళ్ళను గుర్తించి వారికి ఉచిత మందులు, చికిత్స అందజేయటం జరుగుతుం దన్నారు.అనీమియా తో బాధ పడుతున్న వారిని గుర్తించి వారి తల్లితండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి నివారణ చర్యల పైన అవగాహన కల్పించాలన్నారు. పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు తీసుకు రావాలి, అత్యధిక స్ట్రెంత్‌ ఉన్న స్కూల్‌ ‌మనది 10/10 రావాలి ఆటల్లో 30 మంది స్టేట్‌ ‌లెవల్‌ , ‌నేషనల్‌ ‌స్థాయికి వెళ్ళటం జరిగింది..పది ఫలితాల్లో కూడా ముందుండాలన్నారు.యోగ నేర్చుకొని అమ్మ నాన్నలకు సైతం నేర్పించాలి , మంచి మార్కులు రావాలన్న , మంచి ఆలోచన రావాలన్న యోగ అవసరం అన్నారు.టిఫిన్‌ అం‌డ్‌ ‌ట్యూషన్‌ ‌కార్యక్రమం ప్రారంభిస్తున్నాం అల్పాహారం తో పాటు ట్యూషన్‌ ‌కూడా చెప్పండి , హోమ్‌ ‌వర్క్ ‌చేపించి పిల్లల బంగారు భవితకు పునాదులు వేయాలన్నారు. అడపిల్లలతో పాటు అబ్బాయిలను కూడా సామాజిక స్పృహ కల్పించాలి , సమాజం అటు వైపు కూడా ఆలోచించాలన్నారు.ప్రభుత్వ బాలికల పాఠశాల అభివృద్ధి 25 లక్షలు మంజూరు చేస్తున్నాం.. పెయింటింగ్‌ , ‌కిచెన్‌ , ‌గ్రౌండ్‌ ‌పునరుద్ధరణ కోసం నిధుల కేటాయించడం జరిగిందన్నారు. టీవి,ఫోన్లు, సీరియల్స్ ‌కు విద్యార్థులు దూరంగా ఉండి చదువులో ముందుండాలని హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌వేలెటి రోజారాణి, కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామిరెడ్డి, మచ్చ వేణుగోపాల్‌ ‌రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.