ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డల్లాస్ లోని ఇర్వింగ్ నగరంలో ఏప్రిల్ 22న చెస్ పోటీలను నిర్వహించారు. దాదాపు 75 మంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలను తానా డల్లాస్ నాయకులు క్రీడల కమిటీ చైర్మన్ వెంకట్ బొమ్మ, లోకేష్ నాయుడు మరియు కృష్ణ వల్లపరెడ్డి సమన్వయపరిచారు. రాబర్ట్ జోన్స్ నిర్వహణలో విజేతలకు మెమెంటోస్ మరియు మెడల్స్ అందజేశారు.