వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

దేశంలో అక్రమ వలసదారులందరినీ తరిమేస్తాం

September 9, 2019

కేంద్ర మంత్రి అమిత్‌షాఅసోంలోనే కాదు దేశంలో ఎక్కడ అక్రమ వలసదారులున్నా వారందరినీ తరిమేస్తామంటూ కేంద్ర •ంశాఖ మంత్రి అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. గువహటిలో సోమవారం జరిగిన ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి నాలుగో సమావేశంలో పాల్గొన్న అమిత్‌ ‌షా మాట్లాడారు. కేవలం అసోంలోనే కాదు దేశంలోని అక్రమ వలసదారులందరినీ భారత్‌ ‌నుంచి తరిమేస్తాని ఉద్ఘాటించారు. అంతేకాదు, ఈశాన్య భారతాన్ని గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం దేశం నుంచి దూరం చేసిందని షా ఆరోపించారు. అక్రమంగా దేశంలోకి చొరబడిన వారిని తరమేస్తామని పేర్కొన్నారు. ఈశాన్యంలో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఉగ్రవాదానికి కాంగ్రెస్‌ ‌ప్రధాన కారణమని, ఈ ప్రాంతలో అభివృద్ధిని గాలికొదేలిసిందని అమిత్‌ ‌షా దుయ్యబట్టారు. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు ఈశాన్య భారతంలో ఘర్షణలకు బీజం వేశాయని, దీనిని పట్టించుకోకపోవడం వల్లే ఉగ్రవాదం వేళ్లూనుకుందని విమర్శించారు. విభజించు, పాలించు అనే సిద్దాంతాన్నే కాంగ్రెస్‌ ఎప్పు‌డూ అవలంభిస్తోందని షా ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ) తుది జాబితాను అసోం ప్రభుత్వం ఆగస్టు 31 వెల్లడించగా ఇందులో 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొంది. మొత్తం 19 లక్షల మందిని విదేశీయులుగా గుర్తించారు. తొలిసారిగా 1951లో వెల్లడించిన ఎన్‌ఆర్సీకి గత ఆరేళ్లుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో మార్పులు చేర్పులు చేపట్టారు.
అసోంలోని అక్రమవలసదారులెవరో? అసలు భారతీయులెవరో తేల్చేడమే ఎన్‌ఆర్సీ ముఖ్యోద్దేశం. 2017, 2018లో ముసాయిదా ప్రచురించిన రెండు సందర్భాల్లో పలువురు పేర్లు గల్లంతయ్యాయి. ఇప్పటి వరకు జాబితాలో ఉన్న 3,34,54,384 మంది దరఖాస్తుదారుల పూర్తి వివరాలు సెప్టెంబరు 7 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచారు. తుది ఎన్‌ఆర్‌సి నుంచి మినహాయించడం అంటే ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించడం కాదని, అవసరమైతే దీనిపై విదేశీయుల ట్రైబ్యునల్స్, ‌హైకోర్టు, సుప్రీంకోర్టులో అప్పీల్‌ ‌చేసే అవకాశాలు ఉంటాయి. కోర్టు ఉత్తర్వులతో ఎన్‌ఆర్సీలో చేర్పులు ఉంటాయి. అసోంలో అదనంగా 200 విదేశీయుల ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు. ఎన్‌ఆర్సీలో అనర్హులుగా ప్రకటించిన వారు ఆర్జీలపై సెప్టెంబరులో విచారణ చేపడతారు.