వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నరకయాతన చూస్తున్నాం.. మమ్మల్ని కాపాడండి!

May 8, 2019

అబుదాబిలోని తెలంగాణ వాసి నరకయాతన
తన ఇబ్బందులు చెబుతూ వీడియో పెట్టిన బాధితుడు
సోషల్‌ ‌డియాలో వైరల్‌గా మారిన వైనం
స్పందించిన కేటీఆర్‌.. ‌సాయం చేయాలని సుష్మాకు ట్విట్టర్‌లో వినతిబతుకుదెరువు కోసం అబుదాబి వచ్చి నరకయాతన చూస్తున్నామని, కనీసం తిండికూడా సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. తనను, తన కుటుంబాన్ని కాపాడాలని అబుదాబీలో ఉంటున్న కరీంనగర్‌ ‌జిల్లా వాసి వీడియో పెట్టారు. అది సోషల్‌ ‌డియాలో వైరల్‌గా మారడంతో మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌దృష్టికి వెళ్లింది. దీంతో స్పందించిన కేటీఆర్‌.. ‌వీడియోను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌కు ట్వీట్‌ ‌చేస్తూ.. సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ ‌జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం కుటుంబంతో కలిసి అబుదాబికి వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి వద్ద పనికి కుదిరాడు. ఆ వ్యక్తికి చెందిన వంద ఒంటెలను చూసుకోవడం అతని పని. అయితే ఈ రెండేళ్లలో అతను సంపాదించుకున్నదాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. జీతం ఇవ్వక, తిండి పెట్టక హింసిస్తున్నారని అతను వాపోతున్నాడు. ఈ మేరకు తన బాధను చెప్పుకొంటున్న వీడియో పోస్టు చేశారు. సార్‌.. ‌నన్ను ఒంటెల వద్ద ఉంచుతున్నారు. మా యజమాని వద్ద వంద ఒంటెలు ఉన్నాయి. వాటిని నేనొక్కడినే చూసుకోవాలి. నన్నేం చేయమంటారు సార్‌..? ‌మాట్లాడలేకపోతున్నాను. దయచేసి నేను భారత్‌కు వచ్చేటట్లు చూడండి. ఈ ఒంటెల్లో ఒక ఒంటె చనిపోవడంతో మా
యజమాని నన్ను చావగొట్టాడు. మాది కరీంనగర్‌ ‌జిల్లా తుమ్మాపురం మండలం. మాది పేద కుటుంబం. నా అవతారం, పరిస్థితి ఇలా ఉంది సర్‌. అబుదాబికి వచ్చి రెండేళ్లు అవుతోంది. అబుదాబికి ఇరవై కిలోటర్ల దూరంలో ఉన్న ప్రదేశంలో నివసిస్తున్నాను. మేముంటున్న ప్రదేశంలో కరెంట్‌ ‌కూడా ఉండదు. ఇలా ఎలా సర్‌? ఏం ‌చేయమంటారు? మా అమ్మ చనిపోయినప్పుడు కూడా అంత్యక్రియలకు వెళ్లనివ్వలేదు. దయచేసి ఇంటికి వచ్చేలా చూడండి. ఎంత పని చేసినా మాకు సరిగ్గా తిండిపెట్టడం లేదు. నా కుమారులు, భార్య ఆస్పత్రిలో ఉన్నారు. వారిని చూడటానికి కూడా నన్ను పంపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోను ఓ నెటిజన్‌ ‌ట్విటర్‌లో పోస్ట్ ‌చేస్తూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ట్యాగ్‌ ‌చేశారు. దాంతో కేటీఆర్‌ ‌వెంటనే స్పందించారు. ఈ విషయంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అతన్ని ఎలాగైనా విడిపించి భారత్‌కు వచ్చేలా చూడండి అని ట్వీట్‌లో కోరారు.