వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నాగలక్ష్మి కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియ

March 2, 2019

సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్‌ మండంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-11 పనులు వీక్షించేందుకు వెళ్లిన పాలిటెక్నిక్‌ కళాశాలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు గురువారం మధ్యాహ్నం జరిగిన సంఘటన పై రాష్ట్ర మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తన హృదయాన్ని కలచి వేసిందనీ, ఇందుకు సంబంధించిన పూర్వపరాలు తెలుసుకుని క్షేత్ర స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులకు, ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల ను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన నాగలక్ష్మి విద్యార్థినీ కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించి, యుద్ధప్రాతిపదికన రూ.1 లక్ష రూపాయలు అందించినట్లు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తానని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో కాళ్లు విరిగి బాధపడుతున్న ఉమారాణి అనే విద్యార్థినీకి రూ.50 వేల రూపాయలు అందించి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థిని అనూహ్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించామని, అదే విధంగా మరో తొమ్మిది మంది క్షతగాత్రులైన వారికి రూ.10 వేల రూపాయల చొప్పున్న అందిస్తున్నట్లు తెలిపారు. సిద్ధిపేట ఏరియా ఆసుపత్రిలో క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కన్నీంటి పర్యంతమవడంతో వారిని ఓదార్చారు.అందరికీ మెరుగైన వైద్య సేవ లు అందించేలా.. చూస్తానని.. మీరేం అధైర్యపడోద్దని.. నేనున్నానని భరోసా ఇచ్చారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ క్షతగాత్రుకు మంచి వైద్యం అందించాని అక్కడి వైద్యును ఆదేశాు జారీ చేశారు. ఇలాంటి సంఘటను పునరావృతం కాకుండా రక్షణ చర్యు చేపట్టాని పోలీసు అధికారుకు హరీష్‌రావు ఆదేశాు జారీ చేశారు.