వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నిర్వాసితులందరికీ న్యాయం చేస్తా

May 10, 2019

జిల్లాలోని మల్లన్నసాగర్‌, ‌కొండపోచమ్మ రిజర్వాయర్లతో నిర్వాసితులయ్యే వారందరికీ న్యాయం చేస్తామని, సర్వే అధికారులకు ఆయా గ్రామాల ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ ‌క్రిష్ణ భాస్కర్‌ ‌కోరారు. సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్‌ ‌కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం రాత్రి భూ సేకరణ పునరావాస, పునరోపాధి కల్పనపై జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఆర్‌అం‌డ్‌ఆర్‌ ‌కమిటీతో మూడవసారి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో జిల్లా జాయింట్‌ ‌కలెక్టర్‌ ‌పద్మాకర్‌, ‌సిద్ధిపేట ఆర్డీఓ జయచంద్రా రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ‌వేణులతో ఆర్‌అం‌డ్‌ఆర్‌ ‌చెల్లింపులు చేయాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి, ఎల్లం, ఏటిగడ్డ కిష్టాపూర్‌ ‌సర్పంచ్‌ ‌దామరంచ ప్రతాప్‌ ‌రెడ్డిలతో పాటు ముంపు గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులతో కూడిన 26మంది సభ్యుల బృందం సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ మేరకు ముంపునకు గురయ్యే గ్రామ వాసులకు ఆర్‌అం‌డ్‌ఆర్‌ ‌ప్యాకేజీ ఇవ్వాలని పలువురు గ్రామ ప్రజా ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ‌మాట్లాడుతూ.. రిజర్వాయర్ల నిర్మాణంతో ముంపునకు గురయ్యే ప్రతిపాదిత గ్రామాలలో మిగిలిపోయిన చోట సామాజిక, ఆర్ధిక స్థితిగతులపై సర్వే చేపట్టనున్నట్లు, తెలిపారు. జాబితాలో తప్పులు ఉంటే, ఇచ్చిన పరిహారంలో కూడా తప్పులు దొర్లితే వాటిని పునః పరిశీలన నిలుపుదల చేస్తామని జిల్లా కలెక్టర్‌ ‌క్రిష్ణ భాస్కర్‌ ‌చెప్పారు. ముంపునకు గురయ్యే ఏటిగడ్డ కిష్టాపూర్‌, ‌వేములఘాట్‌ ‌గ్రామాల్లో సర్వే చేస్తామని ఆ గ్రామాల ప్రజలు అధికారులు, అధికారిక సిబ్బందికి సంపూర్ణంగా సహకరించాలన్నారు. మీయొక్క పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకునేలా సహకారం చేస్తూ సర్వేను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ‌కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఎస్‌ఈలు వేణు, లీడ్‌ ‌బ్యాంకు మేనేజర్‌ ‌లక్ష్మీ ప్రసాద్‌, ‌వేములఘాట్‌ ‌సర్పంచ్‌ ‌బాలయ్య, రాంపూర్‌ ‌సర్పంచ్‌ అప్పన్నపల్లి శ్యామల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.