వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేటి పోలింగ్‌కు సర్వం సిద్ధం

May 10, 2019

మండల రిటర్నింగ్‌ అధికారి రాంమోహన్‌రావు
నేడు జరిగే ఎంపిటిసి, జెడ్పిటిసి రెండవ విడత ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎంపిడివో రాంమోహన్‌రావు గురువారం తెలిపారు. ఉదయం నుండే ప్రిసైడింగ్‌ అధికారులకు పోలింగ్‌ ‌స్టేషన్‌ ‌వారిగా ఎన్నికల సామాగ్రి బ్యాలెట్‌ ‌పేపర్లు, బ్యాలెట్‌ ‌బాక్సులతో పాటు ఇతర సామాగ్రిని పంపిణి చేసినట్లు తెలిపారు. మొత్తం 87 పోలింగ్‌ ‌స్టేషన్లలలో 8 జోనల్‌ అధికారులు, 87 పివోలు, 87 ఎపివోలు, 317 ఓపివోలు మొత్తం 499 మంది ఎన్నికల విధులను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిబ్బంది తన విధులను నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. పోటీచేసే ప్రతి అభ్యర్ధి ఎన్నికలు ప్రశాంతంగా పోలింగ్‌ ‌జరిగేందుకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.