వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు బాలగోపాల్‌ ‌సార్‌ 10‌వ వర్ధంతి..

October 7, 2019

ఆదర్శానికి, ఆచరణకు, విశ్వాసానికి, వ్యక్తిత్వానికి మధ్య అంతరం లేకుండా జీవించే మానవ హక్కు కోసం అహర్నిశలు పోరాడిన డాక్టర్‌ ‌కె బాల గోపాల్‌..
‌హ్యూమన్‌ ‌రైట్స్ ‌క్రూసేడర్‌
సరిగ్గా తేది గుర్తులేదు కానీ అది 2008 సంవత్సరం అక్టోబర్‌ ‌నెలలో బాలగోపాల్‌ ‌సార్‌ ‌ను దగ్గ రగా చూడడం అదే మొదటి సారి ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళా శాల సుబేదారి హనుమ కొండలో ఆదివాసుల పైన సమావేశంలో సార్‌ ‌మాట్లాడు తున్నారు. సార్‌ ‌మాట్లాడు తున్నంత సేపు చివర్లో కూర్చున్నాను. ఆద్యంతం ఆసక్తిగా గమనిస్తున్న ఆది వాసీలపై సార్‌ ‌మాట్లాడు తున్నంత సేపు కొన్ని కొన్ని విషయాల పట్ల నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. నన్ను ఆ సమావేశం ఎంత ప్రభావితం చేసిందంటే నేను ఆదివాసుల మీద పీహెచ్డీ పూర్తి చేసేంతవరకు తీసుకెళ్ళింది. అలా మొదలైన మా పరిచయం సార్‌ ఎక్కడ మీటింగ్‌ ‌పెట్టిన, ఏం మాట్లాడినా వెళ్లడం అలవాటయింది.
ఆయన వ్యాసం, ఉపన్యాసం, కరపత్రం, సిద్ధాంత పత్రం, పాఠం, నివాళి, జవాబు, సంపాదకీయం, ఇంటర్వ్యూ ఇలా భిన్న రూపాల్లో రాసిన ఏ ఒక్కటి నేను వదిలి పెట్టే వాడిని కాదు. నన్ను నా ఊహల్ని ఆలోచనల్ని ప్రభావితం చేసిన వ్యక్తి డాక్టర్‌ ‌బాలగోపాల్‌ ‌సార్‌. ఆదివాసులకు బాలగోపాల్‌ ‌సార్‌ ఒక పెద్ద దిక్కుగా ఉండేవారు, ఆదివాసులపై క్షేత్రస్థాయిలో అనేక రకాల వేధింపులకు ఆయన ఉనికి ఒక భరోసా ఉండేది. 10 గుంటలు భూమి నుండి మొదలుకొని కొన్ని వేల ఎకరాల భూమి ఆదివాసీలకు ఇప్పించడంలో బాలగోపాల్‌ ‌సంక్రమించిన ఆదివాసీ న్యాయవాది ఇంకొకరు లేరు బాలగోపాల్‌ ‌సార్‌ ‌వంటి న్యాయవాది లేని లోటును ఇప్పటికి ఎవరు పూరించ లేకపోతున్నారు. తాడిత పీడిత అణగారిన వర్గాల హక్కుల కోసం న్యాయవాద వృత్తిని ప్రవృత్తిగా మార్చుకున్న వ్యక్తి 2 తెలుగు రాష్ట్రంలో ఎవరు ఉండరు. నేడు హరితహారం పేరుతో ఆదివాసుల పోడు భూములను, వాటి హక్కులను అటవీ అధికారులు కాలరాస్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు వారి పక్షాన మాట్లాడే ఒక న్యాయవాది కూడా కనిపించడు. నేడు ఆదివాసుల భూమి సమస్య మన దేశంలో కుల సమస్య అంత ప్రాచీనమైన సమస్య. వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ముఖ్యమైనది విస్తాపన మరియు సాంస్కృతిక విధ్వంసం.
సంక్షేమం అనే బాధ్యత మాకు లేదని ప్రభుత్వాలు ఈరోజు స్పష్టంగా అంటున్నాయి. కానీ ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉందని ప్రజలు భావిస్తున్నారు, ప్రజా ఉద్యమాలు భావిస్తున్నాయి. భారత రాజ్యాంగం కూడా అదే స్పష్టం చేస్తుంది. కానీ రాజ్యాంగ వెనకాల సామాజిక సంఘర్షణలు, ఆకాంక్షలు, కోరికలు ఒక రాజకీయ ప్రక్రియ ద్వారా రాజ్యాంగంలో భాగమయ్యాయి. ప్రభుత్వాలు వీటి నుంచి తప్పించుకోవడానికి వీల్లేదు. బాలగోపాల్‌ ‌సర్‌ ‌చనిపోయేంత వరకు జరిపిన చర్చలు, సమావేశాలు, రచనలు ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసారనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ బాల గోపాల్‌ ‌సార్‌ అం‌దరి సమస్యలు ఒకలా చూసి ఆదివాసీల సమస్యలు ప్రత్యేకంగా చూసేవారు. ఈ దేశంలో ఎవరికైనా చేసేది ఉంటే అది కేవలం ఆదివాసులకి అని ప్రత్యేకంగా చెప్పేవారు. ఆదివాసులకు ఎన్ని చట్టాలున్నా రాజకీయ ఒత్తిడులు లేని కారణంగా అవి అమలుకు నోచుకోవడం లేదని సార్‌ ఎప్పుడూ అభిప్రాయపడుతుంటే వారు. బాలగోపాల్‌ ‌సార్‌ ‌వదిలిపోయిన ఈ సంవత్సరాలలో గణాంకాలలో మార్పులు ఉండొచ్చేమో గాని ఆదివాసి సమస్యల పట్ల మౌలిక స్వభావంలో ఎలాంటి మార్పు లేదు. అవే సమస్యలతో ఆదివాసుల జీవనం నేటికీ ఛిద్రము అవుతున్నది.
బాలగోపాల్‌ ‌సార్‌ ‌వదిలిపెట్టిన ఒక్కో సంవత్సరం కొండంత దుఃఖాన్ని మిగిలించి పోతుంది. మనుషులందరికీ ఒకే విలువ ఉండే సమాజం కోసం తపించిన యోధుడు డాక్టర్‌ ‌కె బాల గోపాల్‌. ‌సమాజాన్ని, దాని ఘర్షణను ఒక మౌలిక విలువలు, నైతిక ప్రమాణాల చట్రం నుండి బాలగోపాల్‌ ‌చూశాడు. సామాజిక సంబంధాలు ఉన్నతీకరణ చేయడానికి నైతిక ప్రమాణాలు చాలా అవసరమని బలంగా వాదించాడు. ప్రజాస్వామిక హక్కుల రంగంలో ఎనలేని కృషి చేసిన బాల గోపాల్‌ ‌సార్‌ ఆదివాసులు కాకుండా దళితులు, మైనారిటీలు, స్త్రీలు, విప్లవ ఉద్యమం, మార్కిస్టు తత్వశాస్త్రంపై అనేక రచనలు చేశారు. వారు లేవనెత్తిన ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగిలిపోయాయి. నిత్యజీవితంలో సామాజిక రంగంలో నిబద్ధతతో కూడిన ఆయన సామాన్య జీవితాన్ని ప్రశంసించినా బౌద్ధిక రంగంలో ఆయన కృషి పైన అంతగా చర్చ జరగకపోవడం శోచనీయం
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఉంటుందని ఆశించిన ఆదివాసీలకు నేటి ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి వారి సమాజాన్ని నెట్టింది. ఆదివాసి హక్కుల కోసం ఉద్యమించాలని తమ రచనల ద్వారా బాలగోపాల్‌ ఇచ్చిన పిలుపు ఆదివాసి హక్కుల అమలు ఆకాంక్షించే వారందరూ స్వీకరిస్తారని, ఆచరిస్తారని కోరుకుంటూ…
– చల్లా శ్రీనివాస్‌
‌న్యాయవాది
వరంగల్‌