వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు సాయంత్రం 5 గంటల్లోపు బలపరీక్ష జరపాలి

November 26, 2019

‘మహా’పై సుప్రీమ్‌ ‌కోర్టు కీలక తీర్పుబీజేపీకి సర్వోన్నత న్యాయస్ధానంలో చుక్కెదురైంది. మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం నేడు సాయంత్రం ఐదు గంటలలోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. బహిరంగ బ్యాలెట్‌ ‌విధానంలో పక్రియ పూర్తిచేయాలని స్పష్టంచేసిన సుప్రీంకోర్టు, ఈలోగా ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని, బలపరీక్ష ఒక్కటే అజెండాగా సమావేశం జరగాలని సూచించింది. సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం
బలపరీక్షను ప్రొటెం స్పీకర్‌ ‌నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేగాక.. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితిలో రాజ్యాంగ నైతికతను అన్ని పక్షాలు కాపాడాల్సిన అవసరం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. బాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ‌నేతృత్వంలోని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ అవకాశం ఇవ్వడాన్ని సవాల్‌ ‌చేస్తూ కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేన సుప్రీంకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్‌.‌వి. రమణ, జస్టిస్‌ అశోక్‌ ‌భూషణ్‌, ‌జస్టిస్‌ ‌సంజీవ్‌ ‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం వాదనలు ముగిశాయి. దీంతో మంగళవారం తీర్పు వెలువరించింది.
‘సుప్రీమ్‌’ ‌తీర్పు చరిత్రాత్మకం – సోనియా గాంధీ
మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్‌ ‌ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీం కోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని శివసేన పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపింది. సుప్రీం ఉత్తర్వులతో శివసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు అనంతరం ఖేల్‌ ‌ఖతం అంటూ ఆ పార్టీ నేత నవాబ్‌ ‌మాలిక్‌ ‌ట్వీట్‌ ‌చేశారు.
ప్రొటెం స్పీకర్‌ ‌కోసం ఆరుగురి పేర్లు ప్రతిపాదన..
మహారాష్ట్ర అసెంబ్లీలో బుధవారమే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై తర్జన భర్జన కొనసాగుతోంది. ప్రొటెం స్పీకర్‌ ‌పదవి కోసం ప్రస్తుత ప్రభుత్వం.. ఆరుగురి పేర్లను ప్రతిపాదించింది. ఆ ఆరుగురి పేర్లను గవర్నర్‌ ‌భగత్‌ ‌సింగ్‌ ‌కోశ్యారీకి పంపించారు. రాధాక అష్ణ వైఖే పాటిల్‌(‌బీజేపీ), కాళిదాస్‌ ‌కోలంబ్కర్‌(‌బీజేపీ), బాబన్‌రావు భికాజీ(బీజేపీ), బాలసాహెబ్‌ ‌థోరత్‌(‌కాంగ్రెస్‌), ‌కేసీ పద్వి(కాంగ్రెస్‌), ‌దిలీప్‌ ‌వాల్సే పాటిల్‌(ఎన్సీపీ) పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. వీరిలో అత్యంత సీనియర్లు.. బాలసాహెబ్‌ ‌థోరత్‌, ‌కాళిదాస్‌ ‌కోలంబ్కర్‌. ‌సభలో అత్యంత సినీయార్టి ఉన్న వారికే ప్రొటెం స్పీకర్‌ ‌పదవిని అప్పజెప్పడం జరుగుతుంది. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరును గవర్నర్‌ ‌ఖరారు చేసే అవకాశం ఉంది. ప్రోటెమ్‌ ‌స్పీకర్‌ అం‌టే తాత్కాలిక స్పీకర్‌. అధికారిక స్పీకర్‌ ఉం‌డడు కాబట్టి.. బలపరీక్షకు కావాల్సిన తతంగం అంతా ఆయన చేతులదుగానే సాగాల్సి ఉంటుంది.