వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పోలీసులదే బాధ్యత

December 4, 2019

ఫోటో: ‘‌దిశ’  దుర్ఘటనాస్థలి వద్ద పౌరహక్కుల సంఘం నాయకుల క్షేత్రస్థాయి పరిశీలన..
ఫోటో: ‘‌దిశ’ దుర్ఘటనాస్థలి వద్ద పౌరహక్కుల సంఘం నాయకుల క్షేత్రస్థాయి పరిశీలన..

దిశా కేసులో పోలీసుల నిర్లక్ష్యం..
పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిజనిర్ధారణ
‘‌తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. మద్యం మత్తులోనే హత్యలు అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి ..‘దిశ’ అత్యాచారం, హత్య కూడా మద్యం మత్తులోనే జరిగింది .. ‘దిశ’ హత్య చివరిది కాదు .. హత్యలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మద్యపాన నిషేధం చేస్తే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి ..
– రాష్ట్ర పౌర హక్కుల సంఘం

దిశా కేసులో పూర్తిగా పోలీసుల నిర్లక్ష్యమే కారణం అంటూ పౌర హక్కుల సంఘం నేతలు ఆరోపించారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్‌ ‌నగర్‌ ‌చటన్‌ ‌పల్లి శివారులో దిశాపై పెట్రోల్‌ ‌పోసి తగలబెట్టిన ఘటనా స్థలాన్ని నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించారు. దిశా అత్యాచారం హత్య పోలీసుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని ఆరోపించారు 9:30 నిమిషాలకు పోలీస్‌ ‌స్టేషన్‌ ‌వెళితే రక్షణ కల్పించని పోలీసులు అర్ధరాత్రి మహిళలకు ఏవిధంగా రక్షణ కల్పిస్తారని పోలీసుల తీరుపై మండిపడ్డారు. స్వయంగా దిశా తల్లిదండ్రులు పోలీసుల నిర్లక్ష్యం జరిగిందని తమ ఎదుట వాపోయారని, దిశా కుటుంబ సభ్యుల కలిసి అక్కడి నుండి నేరుగా దిశను కాల్చిన స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనికి పూర్తి బాధ్యత పోలీసులే వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, మద్యం మత్తులోనే హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, దిశా హత్య అత్యాచారం కూడా మద్యం మత్తులోనే జరిగిందని అన్నారు. దిశా హత్య చివరిది కాదని, హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని, మద్యపాన నిషేధం చేస్తే తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. రాష్ట్ర రాజధానికి దగ్గర జాతీయ రహదారికి 10 మీటర్ల దూరంలో మహిళపై దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసి తగులబెట్టితే మహిళలకు రక్షణ ఏక్కడ ఉందని అన్నారు. హత్య కేసులో తెలంగాణ ప్రభుత్వం పోలీసులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని పోలీసుల వైఫల్యమే దిశా హత్యకు దారితీసిందని ఎక్కడో అడవిలో ఉన్న మావోయిస్టులను పట్టుకుంటున్న పోలీసులు హైటెక్‌ ‌నగరానికి కూతవేటు దూరంలో మహిళలపై అత్యాచారం జరిగితే ఎందుకు కాపాడలేకపోయారని అన్నారు. అత్యాచార ఘటనలో నిందితులతో పాటు పోలీసులు కూడా ఈ ఘటనకు కారణమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి మద్యపాన నిషేధం చేయాలని ని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొపెసర్‌ ‌గడ్డం లక్ష్మణ్‌, ‌ప్రధాన కార్యదర్శి నారాయణ రావు, ఉపాధ్యక్షులు రఘునాథ్‌, ‌హైదరాబాద్‌ ‌జిల్లా అధ్యక్షులు పీఎం రాజ్‌, ఉపాధ్యక్షులు హన్మంత్‌ ‌రావు, బాలకృష్ణ, రాంమోహన్‌, ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు.