వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్రతిరోజు ‘‘ఎమర్జెన్సీ’’

November 28, 2019

వైద్యులకు మంత్రి ఈటల సూచన
దవాఖానల సమూల ప్రక్షాళన
త్వరలో అన్ని జిల్లాలలోరోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు
విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు
రాష్ట్రంలోని దవాఖానాలన్నింటిని సమూలంగా ప్రక్షాళన చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ‌నిర్ణయించారు. దవాఖానాలలో ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు, పడకల సంఖ్య పెంపుతో పాటు సక్రమంగా విధులు నిర్వర్తించని వైద్యాధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవా)ని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని దవాఖానాల పరిస్థితిపై ఆ శాఖ ఉన్నతాధికారులతో రెండు రోజుల పాటు విస్త•తంగా సమీక్షా సమావేశాలు నిర్వహించిన మంత్రి రోగులకు చివరి దశలో అవసరమవుతున్న పాలియేటివ్‌కేర్‌ ‌సెంటర్లను ఎక్కువ సంఖ్యలో ప్రారంభించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌, ‌యాదాద్రి, ఖమ్మం, సిద్దిపేట, వరంగల్‌ అర్బన్‌, ‌సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో ఈ సెంటర్లు పనిచేస్తుండగా త్వరలో వీటి సంఖ్యను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. వయో వృద్ధుల ఆరోగ్య సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించే విధంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు.రాష్ట్రంలోని ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్‌ ‌సెంటర్లలో వయో వృద్ధుల ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలలో ఉచిత మందుల పంపిణితో పాటు వారి కుటుంబ సభ్యుల నుంచి ఈసడింపులు ఎదుర్కొంటున్న వారికి ప్రభుత్వ చర్యలు ఊరడింపు కానున్నాయి. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ వైద్య సేవలు ఉచితంగా ఉన్నతంగా లభించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల మేరకు దవాఖానాలు అన్నింటిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. మరో ముందడుగులో భాగంగా ప్రతీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అక్కడి జనాభా, ఆ ప్రాంతంలో ఎక్కువగా సంక్రమించే వ్యాధులు తదితర గణాంకాలు అన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని పీహెచ్‌సి, సబ్‌ ‌సెంటర్లలో మార్పులు చేర్పులు చేస్తారు. 365 రోజులలో ప్రతీ రోజును దవాఖానాలో ఎమర్జెన్సీ రోజు గానే పరిగణించాలన్న లక్ష్యంతో పని చేయాలని మంత్రి వైద్యులకు సూచనలు చేశారు. స్వైన్‌ ‌ఫ్లూతో పాటు ఇతర ఫ్లూ జ్వరాలతో బాధపడే రోగులకు చికిత్స చేసేందుకు ప్రస్తుతం ఉన్న 500 పడకలు సరిపోనట్లయితే, వాటి సంఖ్యను పెంచాలని పూర్తిగా స్వైన్‌ ‌ఫ్లూ నిర్మూలనమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా దవాఖానాలు అన్నింటిలో ఎప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండాలని లేనిపక్షంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. మానసికంగా అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని సమీక్షా సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. వికారాబాద్‌ ‌వంటి చిన్న కేంద్రాల్లో కూడా 657 మంది మానసిక అనారోగ్య బాధితులు నమోదయ్యారు. మానసికంగా అనారోగ్య బాధితుల సంఖ్య పెరగడానికి గల కారణాలపై ప్రభుత్వం నివేదికను సిద్ధం చేయాలని నిర్ణయించింది. నిపుణులైన వైద్యులు వివిధ అంశాలను పరిశీలించిన నివేదికలను సిద్ధం చేయాలనీ, నిర్మూలనకు మార్గాలను సూచించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. నేషనల్‌ ‌క్వాలిటీ అస్యూరెన్స్ ‌ప్రోగ్రాం కింద రాష్ట్రంలో నాలుగు జిల్లా దవాఖానలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఈ అవార్డులను ప్రామాణికంగా తీసుకుని ఇదే స్థాయిలో మరో 19 దవాఖానాలను జాతీయ అవార్డులకు ఎంపికయ్యే విధంగా సిద్ధం చేస్తున్నారు. అలాగే, కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా కొంత మందికి వైద్య పరీక్షలు నిర్వహించి సకాలంలో కళ్లజోళ్లు అందించలేకపోయారు. వీరందరికీ, 15 రోజులలో కళ్ల జోళ్లు అందించాలని నిర్ణయించారు.
•సీఆర్‌ ‌కిట్‌ అం‌దజేస్తున్నప్పటి నుంచి ప్రభుత్వ దవాఖానాలలో ప్రసూతి శాతం 30 నుంచి 55 శాతానికి పెరిగింది. ఈ శాతాన్ని నూటికి నూరు శాతం చేరే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ కిట్‌కు గ్రామీణ ప్రాంతాలలో విశేష ఆదరణ లభిస్తున్నది. గర్భిణిలు ఈ సదుపాయాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. అతి త్వరలో 24 జిల్లాలలో తెలంగాణ డయాగ్నస్టిక్‌ ‌సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలలో అన్ని రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అర్హత, అనుభవం కలిగిన సాంకేతిక నిపుణులు ఈ కేంద్రాలలో ఉంటారు. ప్రైవేటు దవాఖానాలలో రోగుల పట్ల శ్రద్ధ తీసుకోవడం, పరిశుభ్రతను పాటించడం వల్లనే రోగులు ఎక్కువ సంఖ్యలో వెళుతున్నారని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ రెండు అంశాలలో శ్రద్ధ తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఆసుపత్రులకు రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనీ, చికిత్సా సదుపాయాలు సైతం మెరుగుపడతాయని భావిస్తున్నారు.