వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

ప్లాస్టిక్‌ని నిషేదిద్ధాం… ఆరోగ్య సిద్ధిపేట నిర్మిద్ధాం…

May 8, 2019

ఫోటో : సిద్దిపేటలో నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు,  ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి
ఫోటో : సిద్దిపేటలో నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి

అభివృద్ధి… సంక్షేమ పథకాల అమలులో సిద్దిపేట నియోజకవర్గం రాష్ట్ర, దేశానికి ఆదర్శంగా మారింది. ఈ విషయం కేంద్ర, రాష్ట్రాల అందజేసే పలు అవార్డుల ద్వారా స్పష్టమవుతుంది. ఇదే ఒరవడిని ఆరోగ్య సిద్దిపేట నిర్మాణంలోనూ కొనసాగిద్దామని, ఇందుకు ప్లాస్టిక్‌ ‌నిషేదం ఒక్కటే మార్గమని మాజి మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు పిలుపు ఇచ్చారు. పట్టణంలోని 4వ వార్డులో బాల వికాస సహాకారంతో ఏర్పాటుచేసిన వాటర్‌ ‌ప్లాంట్‌ను ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలకు మంచి ఆరోగ్యం అందించాలనే ఉద్దేశ్యంతో ఓవైపు తాగు నీరు అందిస్తూనే మరోవైపు ఊరూరా, వాడవాడలా శుద్ది చేసిన నీటిని అందించే కేంద్రాలను ఏర్పాటు చేయించానన్నారు. ఈ క్రమంలో తన స్వంత డబ్బులను ఉపయోగించి మంచి నాణ్యతగల డబ్బాలను అందజేశానన్నారు. శుద్దిచేసిన జలాల వాడకంతో ప్రజల ఆరోగ్యాలు మెరుగువుతున్నాయన్నారు. అయితే పెరిగిన ప్లాస్టిక్‌ ‌వినియోగంతో ఆరోగ్యాలకు పొంచి ఉన్న తీవ్ర ముప్పు తొలగడం లేదన్నారు. ప్లాస్టిక్‌ ‌వినియోగం పూర్తిగా తగ్గినప్పుడే ఆరోగ్య సిద్దిపేట తయారవుతుందన్నారు. ఇందుకు ప్రజలు చేయాల్సిందల్లా దానిని నిషేదించడమేకాక, సామాజిక బాధ్యతగా చెట్లు నాటడమన్నారు. ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధిస్తే మన ఆరోగ్యాలు బాగుపడడమేకాక రాష్ట్రానికి, దేశానికి ఈ విషయంలోనూ ఆదర్శంగా మారుతామన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్న పై కార్యక్రమ విజయవంతానికి ప్రజలందరూ నడుం బిగించాలని ఎమ్మెల్యే పిలుపు ఇచ్చారు. అభివృద్ధికి చిరునామాగా మారిన సిద్దిపేటను ఆరోగ్యంలోనూ ముందుంచినప్పుడే మన అభివృద్ధికి సార్థకత లభిస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం రూ.5 కోట్ల వ్యయంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో స్విమ్మింగ్‌ ‌ఫూల్‌ని సిద్దిపేటలో ఏర్పాటు చేశామని మీ పిల్లల ఆరోగ్యానికి దీనిని సద్వినియోగం చేసుకోవాలలని ఎమ్మెల్యే హరీశ్‌రావు సూచించారు.
కౌన్సిలర్‌ ‌దీప్తి నాగరాజు పనులు ఆదర్శం
పట్టణ ప్రజల కోసం 4వ వార్డు కౌన్సిలర్‌ ‌దీప్తి నాగరాజు చేపడుతున్న పనులు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. తన వార్డులోని పిల్లలకు సమ్మర్‌ ‌క్యాంప్‌ ‌నిర్వహించడం, స్పోకెన్‌ ఇం‌గ్లీష్‌, ‌యోగ వంటి శిక్షణతో పాటు, సిద్దిపేట అభివృద్ధిని చూపెట్టడం మంచి ఆలోచనని ఇందుకు కౌన్సిలర్‌ను అభినందిస్తున్నట్లు తెలిపారు. సామాజిక బాధ్యతతో కూడిన ఇలాంటి ఆలోచన అందరికీ స్పూర్తిగా నిలుస్తుందని హరీశ్‌రావు కొనియాడారు.