వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బలవంతపు వసూళ్లు చేస్తున్నందుకే హైకోర్టును ఆశ్రయించాం

May 8, 2019

చట్టానికి వ్యతిరేకంగా దుబ్బాక మున్సిపల్‌ అధికారులు బలవంతంగా పన్నులు వసూలు చేస్తూనందు కే కోర్టును ఆశ్రయించామని సిపిఐ పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సభ్యులు మచ్చ శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక మున్సిపల్‌ ‌పరిధిలోని 7 గ్రామాల ప్రజల వద్ద ఎలాంటి నోటీసు ఇవ్వకుండా పన్నులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ విషయమై మున్సిపల్‌ ‌టాక్స్ ‌పేయర్స్ ‌వెల్ఫేర్‌ ‌సొసైటీ ఆధ్వర్యంలో హైకోర్టులో పిల్‌ ‌దాఖలు చేయడం జరిగిందన్నారు. గౌరవ హైకోర్టు జిఓ నెంబర్‌ 45 ‌ప్రకారం ప్రజలకు ఎలాంటి డిమాండ్‌ ‌నోటీసులు ఇవ్వకుండా బలవంత పన్నులు వసూలు చేయకూడదని గౌరవ హైకోర్టు చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రజల వద్ద బలవంతంగా వసూలు చేసిన అధిక పనులను ప్రజలకు తిరిగి చెల్లించాలని ఆయన మున్సిపల్‌ అధికారులను డిమాండ్‌ ‌చేశారు. ఈ అక్రమాలకు అవినీతికి కారకులైనటువంటి వారి పైన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం ఆగదన్నారు. మున్సిపల్‌ ‌పరిధిలోని నాసిరకంగా నిర్మిస్తున్న మురికి కాలువలు సిసి రోడ్లు కాంట్రాక్టు లపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్‌ అధికారులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అవినీతి పట్ల పోరాటాలు నిర్వహిస్తామన్నారు. పనుల పెంపు విషయంలో అధికార పార్టీ వైఖరి తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులు ఆకుల దేవేందర్‌, ‌సమన్వయ సమితి సభ్యులు శ్రీరామ్‌ ‌నరేందర్‌, ఎమ్మార్పీఎస్‌ ఎల్లం ,కూరపాటి సంతోష్‌ ,ఆం‌జనేయులు, రామచంద్రం, ఆకుల భరత్‌, ‌మంగోలి రాజశేఖర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.