వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బిఎస్‌ఎన్‌ఎల్‌లో విఆర్‌ఎస్‌ అమలు

November 11, 2019

70 వేల మంది ఉద్యోగుల దరఖాస్తు

కష్టాల ఊబిలో ఉన్న భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌తమ ఉద్యోగస్తులకు వీఆర్‌ఎస్‌ ఆఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాపు 70వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు వాలంటరీ రిటైర్‌మెంట్‌ ‌స్కీమ్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌ఛైర్మెన్‌, ఎం‌డీ పీకే పువార్‌ ‌తెలిపారు. గతవారమే వీఆర్‌ఎస్‌ ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌ప్రకటించింది. మొత్తంగా లక్ష మందికి వీఆర్‌ఎస్‌ ‌ప్రకటించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌భావించింది. గతవారం వీఆర్‌ఎస్‌ ఆఫర్‌ను ప్రకటించగానే ఇప్పటి వరకు 70వే మంది వీఆర్‌ఎస్‌ ‌కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారని, స్పందన కూడా భారీగా ఉన్నిందని పుర్వార్‌ ‌చెప్పారు. ఇక పెద్ద సంఖ్యలో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తులు
రావడంతో వాటన్నిటినీ పరిశీలించి పక్రియ చాలా స్మూత్‌గా జరిగేలా చూడాలని అన్ని టెలికాం సర్కిళ్లకు ఆదేశాలు జారీచేసింది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఇక గ్రాణ ప్రాంతాల్లో వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రాసెస్‌ను స్మూత్‌గా పూర్తి చేయాలని ఆదేశించింది. వీఆర్‌ఎస్‌ ‌స్కీమ్‌తో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సగానికి తగ్గనుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌వాలంటరీ రిటైర్‌మెంట్‌ ‌స్కీమ్‌-2019 ‌గతవారం ప్రకటించింది. డిసెంబర్‌ 3‌న చివరితేదీగా పేర్కొంటూ అంతలోపు ఆసక్తి ఉన్న ఉద్యోగులు దరఖాస్తులు పూర్తి చేయాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌పేర్కొంది. వీఆర్‌ఎస్‌ ఇవ్వడం ద్వారా సంస్థ రూ.7వేల కోట్లను ఆదాద చేస్తుందని తెలుస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులు, శాశ్వతప్రాతిపదికన ఉన్న ఉద్యోగులు, డిప్యూటేషన్‌పై ఇతర సంస్థల్లో పోస్టు అయిన ఉద్యోగులు, 50 ఏళ్ల వయసున్న ఉద్యోగులు వీఆర్‌ఎస్‌కు అర్హులుగా ప్రకటించింది. వీఆర్‌ఎస్‌ ‌కింద 35 రోజుల జీతం అర్హులైన ఉద్యోగులకు బోనస్‌ ‌కింద ఇవ్వడం జరుగుతుంది. ఇలా తన సర్వీసులో పూర్తి చేసిన సంవత్సరాలకు కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఇక రిటైర్‌మెంట్‌కు మిగిలిన సంవత్సరాలకు గాను 25 రోజుల లెక్కన డబ్బులు చెల్లించనుంది బీఎస్‌ఎన్‌ఎల్‌ ‌సంస్థ.ఇదిలా ఉంటే మహానిగమ్‌ ‌లిమిటెడ్‌ ఎం‌టీఎన్‌ఎల్‌ ‌కూడా తమ ఉద్యోగస్తులకు వీఆర్‌ఎస్‌ ‌స్కీమ్‌ను రోల్‌అవుట్‌ ‌చేసింది.