వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బీజేపీ రహస్య ఎన్నికల బాండ్‌ ‌పథకం గుట్టు?

November 28, 2019

017‌లో ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ ‌జైట్లీ చేసిన బడ్జెట్‌ ‌ప్రసంగంలో రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే విధానాన్ని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందనీ, అందుకోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నామని ప్రకటించినప్పుడు, భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం నిజంగానే కఠినమైన నిర్ణయం తీసుకుందేమోనని అనుకున్నాం. మూడేళ్ళ తర్వాత జైట్లీ గారు ప్రకటించిన ఎన్నికల బాండ్ల పథకం మరింత నిగూఢంగా, ప్రశ్నార్థకంగా, చట్టవిరుద్ధంగా తయారైంది. ‘ది వైర్‌’ ‌చేతికి ఒక సమాచారం అందింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నట్టు ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఒక సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు అందాయన్నది ఆ సమాచారం. వారాంతపు కథనాల్లో భాగంగా ఈ సమాచారం బహిర్గతం అయింది.ఈ బాండ్ల పథకం ముఖ్యోద్దేశ్యం పారదర్శకత. అయితే, ఈ పథకాన్ని వారు రహస్యంగా, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మార్చేశారు. 2017లో ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ ‌జైట్లీ చేసిన బడ్జెట్‌ ‌ప్రసంగంలో రాజకీయ పార్టీలకు విరాళాలిచ్చే విధానాన్ని ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందనీ, అందుకోసమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నామని ప్రకటించినప్పుడు, భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం నిజంగానే కఠినమైన నిర్ణయం తీసుకుందేమోనని అనుకున్నాం. మూడేళ్ళ తర్వాత జైట్లీ గారు ప్రకటించిన ఎన్నికల బాండ్ల పథకం మరింత నిగూఢంగా, ప్రశ్నార్థకంగా, చట్టవిరుద్ధంగా తయారైంది. ‘ది వైర్‌’ ‌చేతికి ఒక సమాచారం అందింది. ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నట్టు ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఒక సంస్థ నుంచి బీజేపీకి విరాళాలు అందాయన్నది ఆ సమాచారం. వారాంతపు కథనాల్లో భాగంగా ఈ సమాచారం బహిర్గతం అయింది. ఈ కథనాల్లో నితిన్‌ ‌సేథీ హాఫింగ్టన్‌ ‌పోస్టులో ప్రచురితమైన పత్రాలను సమాచార హక్కు ఉద్యమ నాయకుడు లోకేష్‌ ‌బాట్రా బయటపెట్టారు. ఇంతకన్నా దారుణమైన రహస్యాన్ని కూడా ఆయన బయటపెట్టారు. ఈ పథకం ప్రవేశ పెట్టిన నాటి నుంచి దాగిన రహస్యాలన్నింటినీ ఆయన బయటపెట్టారు. కానీ ప్రధాన ప్రచార, ప్రసార సాధనాల దష్టికి ఈ సమాచారం రాకపోవడం విడ్డూరమే.
ఎన్నికల బాండ్లు అంటే ఏమిటి?
2017లో ప్రభుత్వం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానంపై కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం ప్రకారం మరింత పారదర్శకత, జవాబుదారీ ఉంటుందని ప్రకటించింది. ఎన్నికల బాండ్లు గిఫ్ట్ ఓచర్ల లాంటివి. వాటిని ఎవరైనా స్టేట్‌ ‌బ్యాంకు నుంచి కొనుగోలు చేయవచ్చు. ఆ బాండ్లను ఆ రాజకీయ పార్టీలకు అందజేయవచ్చు. వాటిపై పేరు రాయకుండా ఇవ్వొచ్చు. దానిని ఆయా పార్టీలు నగదుగా మార్చుకోవచ్చును. ఈ బాండ్ల విక్రయానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలను ప్రకటించింది. ఈ బాండ్లను ఏడాదిలో పది 10 రోజుల విండో ద్వారా పొందవచ్చు. చెక్కులతో కొనవచ్చును. లేదా డిజిటల్‌ ‌పద్దతిలో బదిలీ చేయవచ్చు. ఈ మార్పును కూడ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించిన చట్టంలో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. లాభాలు వచ్చే కంపెనీలు మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వాలని సవనరణ చేశారు. విదేశీ సంస్థలకు అది సులభతరం అవుతుంది.
బాండ్లపై విమర్శలు ఎందుకు?
ఈ పథకం పారదర్శకత కోసం తెచ్చామంటున్న ప్రభుత్వం దీని పర్యవసానాలను ఆలోచించడం లేదని విమర్శకులు పేర్కొంటున్నారు. ఈ పథకం వల్ల మరిన్ని రహస్య కార్యకలాపాలు జరుగుతాయన్నది వారి అభిప్రాయం. ఎందుకంటే ఏ కంపెనీల నుంచి ఆ విరాళాలు వచ్చాయో చెప్పాల్సిన అవసరం లేకపోవడం పెద్ద లోపం. ఎన్నికల బాండ్లను షెల్‌ ‌కంపెనీలు సులభంగా ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. షెల్‌ ‌కంపెనీలు అంటే కాగితంపైన మాత్రమే ఉండే కంపెనీలు. వాటికి వ్యాపార కార్యకలాపాలు ఉండవు. ఈ పథకం వల్ల రాజకీయ పార్టీల విరాళాల విధానంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఎన్నికల కమిషన్‌ ‌సుప్రీమ్‌కోర్టుకు తెలిపింది. ఎన్నికల కమిషన్‌ ‌మాత్రమే కాదు, రిజర్వు బ్యాంకు కూడా ఈ పథకానికి అభ్యంతరం తెలిపింది. ఇలాంటి బాండ్ల వల్ల చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్టు అవుతుందని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. స్టేట్‌ ‌బ్యాంకు జారీ చేసే ఎన్నికల బాండ్ల వల్ల రిజర్వు బ్యాంకు ప్రతిపత్తి తగ్గి పోతుందని ఆనాటి రిజర్వు బ్యాంకు గవర్నర్‌ ఉర్జిత్‌ ‌పటేల్‌ ‌పేర్కొన్నారు. ఆర్థిక శాఖకు ఆయన లేఖ రాసినట్టు బిజినెస్‌ ‌లైన్‌ ‌పేర్కొంది. రాజ్యాంగ పరమైన రెండు స్వతంత్ర సంస్థలు వ్యతిరేకించినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికే నిర్ణయించింది. బాట్రా సేకరించిన పత్రాలు పరిశీస్తే ఎన్నికల బాండ్లను ఎలా ఉపయోగించాలి అనేదానిపై ప్రభుత్వానికే స్పష్టత లేనట్టు కనిపిస్తోంది. ఈ పథకంపై అభ్యంతరాలను విస్మరిస్తూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి రాధాకృష్ణన్‌ ‌గత ఏడాది పార్లమెంటులో చెప్పిన సమాధానంలో రిజర్వ్ ‌బ్యాంకు నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదని చెప్పారు. అయితే, ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌రిజర్వు బ్యాంకు తీవ్రమైన అభ్యంతరాలు తెలిపినట్టు అంగీకరించారు. అయితే, ఈ పథకంపై వచ్చిన అభ్యంతరాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని వాషిగ్టన్‌ ‌పోస్టుకు లభించిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
– ‘స్క్రోల్‌.ఇన్‌’ ‌సౌజన్యంతో..