వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

బెల్టు షాపులపై మహిళల దాడి

October 9, 2019

దాడిచేసి తగలు బెట్టిన నారీమణులుబెల్ట్ ‌షాపుల్లో మద్యం అమ్మకాలపై మహిళలు కన్నెర్ర చేశారు. తమ కుటుంబాల్లో చిచ్చుపెడుతున్న బెల్ట్ ‌షాపులపై దాడి చేశారు. భారీ ఎత్తున మద్యం నిల్వాలను ధ్వంసం చేశారు. కుమురంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా, పాటిబండ సపంలోని వట్టివాగు ప్రాజెక్టు పునరావాస గ్రామంలో ఇది జరిగింది. ఈ గ్రామంలో కిరాణాషాపుల్లో కొన్నాళ్లుగా మద్యం విక్రయాలు చేస్తున్నారు. దీంతో గ్రామానికి చెందిన యువత మద్యానికి బానిస అవుతోంది. ప్రతి కుటుంబంలోనూ మద్యం చిచ్చురేపుతోంది. నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. నిన్న దసరా పండుగరోజు విచ్చలవిడిగా విక్రయాలు జరపడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే బుధవారం మహిళలంతా ఒక్కచోటుకు చేరుకున్నారు. వారికి గ్రామంలోని యువత తోడయ్యారు. అంతా కలిసి బెల్ట్ ‌షాపులపై దాడి చేశారు. దొరికిన మద్యాన్ని దొరికినట్టే ధ్వంసం చేశారు. ఇంకోసారి అమ్మితే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. అలాగే సిద్ధిపేట్‌ ‌జిల్లాలో బెల్ట్ ‌షాపులపై మహిళా సంఘాలు దాడి చేశాయి. దుబ్బాక మండలం రాజక్కపేటలో ఉన్న బెల్ట్ ‌షాపులపై మహిళలు దాడి చేసి మద్యాన్ని రోడ్డుపై పడేశారు. గ్రామంలో మద్యం అమ్మొద్దు అంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఊర్లలో మద్యం.. ఏరులై పారుతున్నాయన్నారు. మద్యం మత్తులో ఇళ్ళకు వచ్చిన భర్తలు భార్యలతో గొడవలకు దిగుతున్నారన్నారు. మద్యాన్ని నిషేధించాలని డిమాండ్‌ ‌చేశారు. మహిళలలో పాటు కొంత గ్రామస్తులు కూడా నిరసనలో పాల్గొన్నారు.